రాయల టి: ఓయులో ఉద్రిక్తం, టి కాంగ్‌పై కెటిఆర్ ధ్వజం

ఎన్‌సిసి గేటు వద్దకు ర్యాలీ చేరుకున్నాక పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. జై తెలంగాణ, రాయల తెలంగాణ వద్దు, రాయల టి ప్రతిపాదనను విరమించుకోవాలని నినాదాలు చేస్తూ విద్యార్థులు బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ఈ ర్యాలీలో పదమూడు విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి.
విద్యార్థులు బయటకు వెళ్లకుండా ఎన్‌సిసి గేటు మూసి వేసిన పోలీసులు బారీకేడ్లను, ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. పోలీసులు భారీగా మోహరించారు. విద్యార్థులు బయటకు వచ్చే ప్రయత్నాలు చేస్తుండటంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.
గన్ పార్కు వద్ద కెటిఆర్ ధర్నా
రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు గన్ పార్కు వద్ద ధర్నా చేపట్టారు. తెలంగాణ కాంగ్రెసు నేతలకు వెన్నెముక లేదని, లాబీయింగుకు తలొగ్గుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డిఎస్‌ను ధ్వంసం చేసి నీళ్లు దోచుకుంటున్న రాయలసీమతో తాము ఎలా కలుస్తామని ప్రశ్నించారు. రాయల టిని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు.












Click it and Unblock the Notifications