పది ఫలితాల విడుదల తేదీలు ఫిక్స్- ఏపీ, తెలంగాణలో ఇలా..!!

పదో తరగతి పరీక్షల ఫలితాల షెడ్యూల్ ఖరారు అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పది వాల్యుయేషన్ తుది దశకు చేరుకుంది. ఈ నెల 23వ తేదీతో మూల్యాంకనం పూర్తి చేసారు. మార్కులు.. ఫలితాల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. అదే సమయంలో ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా ఫలితాల విడుదలకు వీలుగా కసరత్తు చేస్తున్నారు. ఫలితాల తేదీ దాదాపు ఖరారు చేసారు. రెండు రాష్ట్రాల్లోనూ ఒక్క రోజు తేడాతో ఫలితాలు విడుదల దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి ఫలితాల వెల్లడి దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏపీ లో ఇప్పటికే పరీక్షా పత్రాల వాల్యుయేషన్ పూర్తి కాగా, తెలంగాణలో ఈ నెల 23తో పూర్తి చేసే విధంగా షెడ్యూల్ ఫిక్స్ చేసారు. ఏపీలో మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు 6,40,916 మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఏప్రిల్ 15 వరకు మూల్యాంకనం కొనసాగింది. ప్రస్తుతం మార్కుల ప్రాసెసింగ్‌ కొనసాగు తోంది. తొలుత ఈ నెల చివరి వారంలోనే ఫలితాలను ప్రకటించాలని అధికారులు భావించారు. కాగా, తాజాగా మే నెల మొదటి వారం నాటికి పదో తరగతి ఫలితాలు వెల్లడించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా ఈసారి పదో తరగతి విద్యార్ధులకు 6 మార్కులు అదనంగా అందరు విద్యార్ధులకు కలవనున్నాయి. హిందీలో 2 మార్కులు, ఇంగ్లిష్‌లో 4 మార్కులు చొప్పున కలిపే విధంగా ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది.

వేసవి సెలవుల ప్రారంభం వేళ బిగ్ అలర్ట్, తాజా ఆదేశాలు..!!
వేసవి సెలవుల ప్రారంభం వేళ బిగ్ అలర్ట్, తాజా ఆదేశాలు..!!
tenth-class-examination-results-to-release-in-ap-telangana-on-may-3rd-or-4th-as-reports

రెండు రాష్ట్రాల్లోనూ మే తొలి వారంలో విడుదల

కాగా, తెలంగాణలో మార్చి 14న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 13తో ముగిసాయి. మొత్తం 5.17 లక్షల మంది రెగ్యులర్‌ విద్యార్థులు రాశారు. తెలంగాణలో పదో తరగతి పరీక్షా పత్రాల వాల్యుయేషన్ ఏప్రిల్ 1 నుంచే ప్రారంభమైంది. ఏప్రిల్ 23వ తేదీతో ఈ మూల్యాంకన ప్రక్రియ పూర్తికానుంది. ఈ ప్రక్రియ పూర్తి చేసి.. మార్కుల నమోదు ప్రాసెస్‌ ప్రక్రియకు మరో పదో రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో, మే 4 లేదా 5వ తేదీల్లో పదో తరగతి ఫలితాలు వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు. వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడించేందుకు ప్రయత్నం చేస్తున్నామని... ఫలితాల వెల్లడి సమయంలో విద్యార్ధుల కు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి సమాచారం ఇచ్చే విధంగా పకడ్బందీగా కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా గత ఏడాది ఏప్రిల్ 30న ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది కూడా ఏప్రిల్ 30న లేదా మే మొదటి వారంలో ఫలితాలను ప్రకటించేందుకు కసరత్తు కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+