పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!

పదో తరగతి పరీక్షల వాల్యుయేషన్ .. ఫలితాల వెల్లడి షెడ్యూల్ ఖరారు చేసారు. ఏప్రిల్ 2వ తేదీ తో పదో తరగతి పరీక్షలు పూర్తి కానున్నాయి. వీలైనంత త్వరగా మూల్యాంకనం పూర్తి చేసిన ఫలితా లను విడుదల చేయాలని ఏపీ విద్యా శాఖ భావిస్తోంది. ఫలితాలను సాధ్యమైనంత త్వరగా ప్రకటిస్తే విద్యార్ధులకు ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. దీంతో.. పది రోజుల పాటు పరీక్షా పత్రాల వాల్యుయేషన్ తేదీలను ఖరారు చేసారు. ఫలితాల వెల్లడి పైన అధికారులు ఒక అంచనా కు వచ్చారు.

ఏపీలో పదో తరగతి పరీక్షలు చివరి దశకు వచ్చాయి. ఈ నెల 16న ప్రారంభమైన పరీక్షలు వచ్చే నెల ఏప్రిల్ 2వ తేదీతో ముగియనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,40,916 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. పరీక్షలు పూర్తయిన వెంటనే జవాబు పత్రాల మూల్యాకనం ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఏప్రిల్ 4వ తేదీ నుంచి పది రోజుల పాటు ఏప్రిల్ 13 వరకు మూల్యాంకనం ప్రక్రియ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీ క్షల విభాగం వెల్లడించింది. మూల్యాంకనంలో పాటించాల్సిన నిబంధనలపై డైరెక్టర్ శ్రీనివాసుల రెడ్డి తాజాగా మార్గదర్శకాలు విడుదల చేశారు. రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లా కేంద్రాల్లో 10 రోజుల పాటు ఈ మూల్యాంకనం నిర్వహించనున్నారు. ఒక్కో అసిస్టెంట్ ఎగ్జామినర్‌కు ఒక రోజుకు 40 జవాబు పత్రాలను అందిస్తారు. ఇందులో ఉదయం 20, మధ్యాహ్నం నుంచి 20 చొప్పున జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది.

tenth-class-valuation-in-andhra-pradesh-begins-in-next-week-results-likely-to-release-in-april-thir

ఏప్రిల్ మూడో వారంలో ఫలితాల విడుదల..!

కాగా, మార్కులను మాన్యువుల్‌తో పాటు ట్యాబ్‌ల్లోనూ నమోదు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానం ఈ సారి నుంచి ఇంటర్ తో పాటుగా పదో తరగతి వాల్యుయే షన్ లోనూ అమలు కానుంది. మార్కుల లెక్కింపులో పొరపాటు లేకుండా ఉండేందుకు ఈ ఏడాది ట్యాబ్‌లను తీసుకొచ్చారు. మార్కులను ఎప్పటికప్పుడు ట్యాబుల్లో నమోదు చేసి పొరబాట్లకు తావులేకుండా ఖచ్చితత్వం పాటించాలని హెచ్చరించింది. కాగా, ఏప్రిల్ 14 నుంచి మార్కుల నమోదు ప్రక్రియను మరో 10 రోజుల్లో పూర్తి చేసి ఏప్రిల్‌ మూడో వారం నాటికి పదో తరగతి ఫలితాలు వెల్లడించాలని విద్యాశాఖ భావిస్తుంది. గతే ఏడాదిలో ఏప్రిల్ 23వ తేదీన ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేసారు. ఈ సారి దాదాపుగా ఏప్రిల్ 20 నుంచి 25 మధ్యన పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+