జగన్‌కు జ్యోతుల నెహ్రూ రాసిన లేఖ పూర్తి పాఠం
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ప్రచారానికి మంగళవారంనాడు తెర పడింది. వైయస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జ్యోతుల నెహ్రూ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తెలుగులో స్వదస్తూరితో రాసిన రాజీనామా లేఖను పంపారు.
'మీ మనసుకు నచ్చినట్లు నడుచుకోలేక పోతున్నా'నని అందులో జ్యోతుల స్పష్టం చేశారు. పార్టీ సభ్యత్వంతో పాటు తనకు అప్పగించిన అన్ని బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ఆ లేఖలో జ్యోతుల తెలిపారు. ఇటీవల టీడీపీలోకి వచ్చిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వైసీపీ ఉన్నప్పుడు నిర్వహించిన పీఏసీ ఛైర్మన్ పదవి విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయంతో జ్యోతుల నెహ్రూ తీవ్ర ఆసంతృప్తికి గురయ్యారు.

ఆయన జగన్‌కు రాసిన రాజీనామా లేఖ పూర్తి పూఠం...
గౌరవ శ్రీయుత వై.యస్.ఆర్ కాంగ్రేస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వై.యస్. జగన్మోహన్ రెడ్డి గార్కి నమస్కరించి సమర్పించు రాజీనామా పత్రం
ఆర్యా!
పార్టీలో మీ యొక్క ఆలోచనలకు అణుగుణంగా పని చేయలేని కారణంగా వై.యస్.ఆర్.కాంగ్రేస్ పార్టీలో మీరు నాకు అప్పగించిన అన్ని బాధ్యతల నుంచి అనగా తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పొలిటికల్ ఎఫైర్స్కమిటీ సభ్యుడు తదితర పదవుల నుండి తప్పుకొనుచున్నాను. కావున ఆమోదించవలసినదిగా కోరుచున్నాను.
ధన్యవాదములతో
భవదీయుడు
సంతకం












Click it and Unblock the Notifications