స్పీడ్ బ్రేక్: టిపై టిజి ఆసక్తికరం, ఆంధ్రులకే నష్టం: హరీష్

సీమాంధ్ర ప్రజలకు ప్రజాప్రతినిధులు ఎలాంటి అన్యాయం చేయలేదన్నారు. కొన్ని పార్టీల అధినేతలే లేఖలు ఇచ్చి ప్రజలకు అన్యాయం చేశారని వైయస్ జగన్, చంద్రబాబు నాయుడులను ఉద్దేశించి అన్నారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన వారు ఇప్పుడు ప్రజల మధ్య తిరుగుతున్నారని విమర్శించారు.
తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. యుద్ధంలోకి దిగాక గెలుపు ఓటముల కంటే యుద్ధం ఏ స్థాయిలో చేస్తున్నామనేదే ముఖ్యమని ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. కాగా, టిజి వెంకటేష్ తన వ్యాఖ్యల ద్వారా విభజన ఖాయమని చెప్పినట్లుగా కనిపిస్తోంది.
ఢిల్లీని దిగ్బంధం చేస్తే విభజన ఆగుతుందన్నారు. మనం నష్టపోతూ ఉద్యమం చేయడం వృథా అన్నారు. ఆంధ్రా ప్రాంత నేతలు తమ ప్రాంతానికి రాజధాని కోరుతుండటంతో సీమ నేతలు, ప్రజలు రాయల తెలంగాణ అంటున్నారన్నారు.
ఆంధ్రులకే నష్టం: హరీష్ రావు
ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు వ్యాఖ్యలతో హైదరాబాదులోని ఆంధ్రులకే నష్టమని తెరాస సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు మహబూబ్ నగర్ జిల్లాలో అన్నారు. మంత్రి టిజి వెంకటేష్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాదులోని ఆస్తులను కాపాడుకునేందుకే కొందరు రాయల తెలంగాణ అంటున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో తెరాస పాత్ర కీలకం అన్నారు. అసెంబ్లీ ప్రోరోగ్ కాకుండా ఆపే బాధ్యత మంత్రి శ్రీధర్ బాబుదే అన్నారు.












Click it and Unblock the Notifications