చంపుతాం: టిజికి ఎస్సెమ్మెస్, పొన్నాల ఇంటి వద్ద టెన్షన్
హైదరాబాద్/వరంగల్/కర్నూలు: తనకు బెదిరింపు సందేశాలు వస్తున్నాయని మాజీ మంత్రి, ఇటీవలె తెలుగుదేశం పార్టీలో చేరిన టిజి వెంకటేష్‌కు సోమవారం చెప్పారు. తన పైన హత్యకు కుట్ర చేస్తున్నారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తనకు బెదిరింపు సందేశాలు వస్తున్నాయని, ఇలాంటి వాటికి తాను భయపడే ప్రసక్తి లేదన్నారు.
ప్రశాంతంగా ఉన్న కర్నూలు జిల్లాలో నేర సంస్కృతిని ప్రవేశ పెట్టాలని కొందరు చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయమై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. ఓ వికలాంగుడి సెల్ నుండి తనకు మెసేజ్‌లు వస్తున్నాయన్నారు. తన హత్యకు ఎవరో కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

పొన్నాల ఇంటి ఎదుట ఆత్మహత్యాయత్నం
తనకు జెడ్పీటిసి టిక్కెట్ ఇస్తానని చెప్పి మోసం చేశారంటూ మహేందర్ రెడ్డి అనే వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లా జనగామలోని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య నివాసం ఎదుట జరిగింది. పక్కనున్న కార్యకర్తలు ఆయన్ను అడ్డుకున్నారు.
పొన్నాలను తొలగించాలని ఆందోళన
టిపిసిసి అధ్యక్ష పదవి నుండి పొన్నాల లక్ష్మయ్యను తొలగించాలని డిమాండ్ చేస్తూ.. సంజయ్ గాంధీ యువసేన అధ్యక్షుడు రాఘవ్ గౌడ్ సోమవారం హైదరాబాదులోని గాంధీ భవన్ పైకి ఎక్కి ఆందోళనకు దిగారు. జలయజ్ఞంలో కోట్లు దండుకున్న పొన్నాలకు పిసిసి పదవి ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు. తక్షణమే ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications