ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!
ఆర్టీసీ ప్రయాణీకులకు బిగ్ అప్డేట్. ఛార్జీల్లో సవరణలు చేస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. రెండు రాష్ట్రాల బస్సుల్లో ఛార్జీలు ఒకేలా ఉండేలా ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులతో సమానంగా టీజీఎస్ఆర్టీసీ బస్ ఛార్జీలను సవరించారు.ఈ మేరకు అధికారికంగా కొత్త రేట్లను ఖరారు చేసారు. ప్రయాణీకుల నుంచి వస్తున్న ఫిర్యాదులు.. బస్సుల ఆక్యుపెన్సీ పెంచుకునే క్రమంలో భాగంగా ఆర్టీసీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారికంగా నిర్ణయాన్ని వెల్లడించారు.
ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో తిరిగే టీజీఎస్ఆర్టీసీ బస్సు ఛార్జీలను అధికారులు సవరించారు. ప్రస్తుతం ఏపీలో సర్వీసులు అందిస్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లోని ఛార్జీలు ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో కంటే ఎక్కువగా ఉన్నాయి. దూరాన్ని బట్టి రూ.20 నుంచి రూ.130 వరకు అధికంగా ఉన్నాయి. టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు ఎక్కువగా ఉండటంతో వీటిని సవరించాలని పలుమార్లు ప్రయాణికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రెండు రాష్ట్రాల బస్సుల్లో ఛార్జీలు ఒకేలా ఉండేలా ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులతో సమానంగా టీజీఎస్ఆర్టీసీ బస్ ఛార్జీలను సవరించారు. ఈ నిర్ణయం ద్వారా ఆక్యుపెన్సీ రేషియో పెంచుకొనే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒకే ప్రాంతంలో తిరిగిఏపీ, తెలంగాణ బస్సుల్లో ఛార్జీలు వేర్వేర్వుగా ఉండటం, టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఎక్కువగా ఉండటంతో అధికారులు సవరణలకు శ్రీకారం చుట్టారు.

ప్రయాణీకుల డిమాండ్ మేరకు సవరణలు
తాజాగా ఛార్జీల్లో మార్పులు చేయటంతో ప్రయాణీకుల నుంచి ఆదరణ పెరుగుతుందని అధికారు లు అంచనా వేస్తున్నారు. అటు ఈ సందర్బంగా ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు మరో కీలక ప్రకటన చేశారు. ఉచిత బస్సు ప్రయాణం అమలువుతున్న బస్సుల్లో వృద్దులు, దివ్యాంగులకు కేటాయించిన సీట్లను వారికే అప్పగించాలని, మహిళలు కూర్చోవద్దని అధికారులు ప్రత్యేకంగా సూచిస్తున్నారు. వారికి కేటాయించిన ప్రత్యేక సీట్లలో వారు మాత్రమే కూర్చునేలా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. కాగా, అన్ రిజర్వుడ్ బస్సుల్లో వృద్దులు, దివ్యాంగులకు ప్రత్యేకంగా రెండు సీట్లు చొప్పున రిజర్వ్ చేసి ఉంటాయి. అయితే స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం అందిస్తోంది. దీని వల్ల బస్సులన్నీ రద్దీగా ఉంటున్నాయి. వృద్దులు, దివ్యాంగులకు రిజర్వ్ చేసిన సీట్లలో కూడా మహిళలే కూర్చుంటున్నారు. దీంతో బస్సుల్లో ప్రయాణికుల మధ్య తరచూ వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. పలుమార్లు ఈ విషయంపై ఆర్టీసీ అధికారులకు ప్రయాణికుల నుంచి ఫిర్యాదు అందాయి. దీంతో అధికారులు స్పందించి.. ఈ మేరకు ప్రకటన చేసారు.












Click it and Unblock the Notifications