'తల్లికి వందనం'లో కొత్త మెలిక, వారికే వర్తింపు - అమలు వేళ..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్దమైంది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందనం పైన కసరత్తు చేస్తోంది. బడ్జెట్ లో ఈ పథకం కోసం నిధులు కేటాయించారు. హామీ ఇచ్చి విధంగా ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ రూ 15 వేలు చొప్పున ఇస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అదే సమయంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు ఇప్పుడు లబ్దిదారుల ఎంపికలో కీలకం కానున్నాయి. అయితే, అమలు లో మాత్రం కొత్త మెలిక కనిపిస్తోంది. ప్రభుత్వ తాజా ప్రతిపాదనతో అమలు విషయంలో లబ్ది దారుల్లో ఉత్కంఠ కనిపిస్తోంది.

అమలు వేళ
ఏపీ ప్రభుత్వం మరో ముఖ్య పథకం అమలుకు సిద్దమైంది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం అమలు దిశగా కసరత్తు వేగవంతం చేసారు. బడ్జెట్ లో ఈ పథకం కోసం నిధులు కేటాయించారు. హామీ ఇచ్చిన విధంగా ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ రూ 15 వేలు చొప్పున ఇస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అదే సమయంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు ఇప్పుడు లబ్దిదారుల ఎంపికలో కీలకం కానున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోగానే తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటి కే పలు మార్లు స్పష్టం చేసింది. అయితే, తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఈ పథకం అమలు విషయంలో కొత్త చర్చ మొదలైంది.

చంద్రబాబు వ్యాఖ్యలతో
శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార భరోసా విడుదల సమయంలో తల్లికి వందనం పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ పథకం అమలు చేస్తామని మరో సారి స్పష్టం చేసారు. విద్యా సంవత్సరం ప్రారంభం లోగా ఇస్తామని చెబుతూనే... ఒక ఇన్ స్టాల్ మెంటా లేక ఎలా ఇవ్వాలనేది ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. దీంతో, ఒకే విడతలో రూ 15 వేలు చెల్లిస్తారా.. రెండు విడతలుగా రూ 7500 చొప్పున చెల్లించే ఆలోచన చేస్తున్నారా అనే చర్చ మొదలైంది. ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించిన లబ్దిదారుల సంఖ్య... కావాల్సిన నిధుల పైన ఒక అంచనాకు వచ్చారు. ఇదే నెలలో అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను విడుదల చేయాల్సి ఉండటంతో ఇనిస్టాల్ మెంట్ అంశం తెర పైకి వచ్చినట్లు కనిపిస్తోంది.

thalli-ki-vandanam-likely-to-implement-in-installments-as-reports

కసరత్తు - తుది నిర్ణయం
ముఖ్యమంత్రి తల్లికి వందనం పైన చేసిన తాజా వ్యాఖ్యల పైన మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఒకే విడతలో ఈ నిధులు చెల్లిస్తారా.. ఇనిస్టాల్ మెంట్ విధానంలో అమలు చేస్తారా అనేది తేలాల్సి ఉందని చెబుతున్నారు. నిధుల కేటాయింపు మే నెలలో అమలు చేసేలా మార్గదర్శకాల పై కసరత్తు జరుగుతోంది. 2025-26 బడ్జెట్‌లో రూ. 9407 కోట్లు ఈ పథకానికి కేటాయింపులు చేసారు. 2024-25 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారు. అయితే ఇందులో ప్రాధమికం గా 69.16లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చిన్నట్లు సమాచారం. ఇదే సమ యం లో విద్యార్ధులకు 75 శాతం హాజరు నిబంధన కొనసాగనుంది.

Take a Poll

మార్గదర్శకాలు
ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాల పైన అధ్యయనం కొనసాగుతోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ను సమీక్షిస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లింపు దారులు..తెల్లరేషన్‌ కార్డు లేనివారిని, 300 యూనిట్ల విద్యుత్‌ వినియోగించేవారిని, కారు కలిగి ఉన్న వారిని, అర్బన్‌ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్నవారికి పథకం అందటం లేదు. ఇక, ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. విద్యుత్ వినియో గం, కారు ఉండటం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా.. లేక, కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+