పరిటాల రవి అభిమానమే కొండంత అండ: సునీత
తన భర్త పరిటాల రవిపై అభిమానమే తమ కుటుంబానికి కొండంత అండ అన్నారు ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత.
అనంతపురం: తన భర్త పరిటాల రవిపై అభిమానమే తమ కుటుంబానికి కొండంత అండ అన్నారు ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత. పరిటాల శ్రీరామ్, జ్ఞాన వివాహానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ మంత్రి పరిటాల సునీత ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత వెంకటాపురంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా స్వచ్ఛందంగా పెళ్లికి హాజరు కావడం చూస్తుంటే ఆ అభిమానం జీవితాంతం మరువలేమని చెప్పారు పరిటాల సునీత.

ఈ పెళ్లికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రత్యేకంగా హాజరై వధూవరులను ఆశీర్వదించడం ఎంతో అనుభూతి కలిగించిందన్నారు.
అలాగే వివాహానికి హాజరైన సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులతోపాటు సినీ ప్రముఖులు నందమూరి బాలకృష్ణ, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ దంపతులు, మోహన్‌బాబు, మంచు లక్ష్మి, సునీల్, వేణుమాధవ్, దర్శకుడు బోయపాటి శీను, శ్రీరాములయ్య సినిమా డైరెక్టర్ శంకర్ తదితరులు హాజరై ఆశీర్వదించడం పట్ల ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఏపీ, తెలంగాణ, కర్ణాటకల నుంచి వచ్చిన సినీ, రాజకీయ, పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు, మరీ ముఖ్యంగా పరిటాల అభిమానులు, కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరికీ మంత్రి పరిటాల సునీత పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications