టీడిపి అస్త్రం అదేనా..!జ‌గ‌న్ ను నిలువ‌రించేందుకు ఆ నినాదాన్నే బాబు ఎంచుకున్న‌రా..!?

Recommended Video

    AP Election 2019 : Chandrababu Naidu Will Continue As The Way, If He Become CM In 2019 ? | Oneindia

    అమ‌రావ‌తి/ హైద‌రాబాద్ : జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసును బూచిగా చూపి మ‌రో అవ‌కాశం కోసం టీడిపి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితే, అనుభ‌వ లేమి, అవినీతి ఆరోప‌ణ‌లున్న నేత, కొత్త రాష్ట్రం క‌ష్టాల్లో ప‌డుతుందనే ప్ర‌చారం 2014లో చంద్ర‌బాబును సీఎం చేసింది. చంద్ర‌బాబునాయుడు సీఎం అయితే అభివృద్ధి కొన‌సాగుతుంది. రాష్ట్రం ఎక్క‌డికో వెళ్లిపోతుంది. ఇదీ 2019 నాటి బాబు ప్ర‌చారం. ఐదేళ్ల క్రితం చెప్పిన‌మాట‌నే మ‌ళ్లీ రిపీట్ చేయ‌బోతున్నారు. చంద్ర‌బాబు.

    ఏపీ లో వేడెక్కిన రాజ‌కీయాలు..! ఆదిప‌త్యం కోసం ఆప‌సోపాలు..!!

    ఏపీ లో వేడెక్కిన రాజ‌కీయాలు..! ఆదిప‌త్యం కోసం ఆప‌సోపాలు..!!

    కానీ.. నాలుగేళ్ల త‌రువాత‌.. అభివృద్ధి సంగ‌తి ఎలా ఉన్నా బాబు ప్ర‌భుత్వం పై అవినీతి ఆరోప‌ణ‌లు తారాస్థాయిలో చెల‌రేగాయి. ప‌రిపాల‌న‌లో చాకచక్య‌త ఉన్న త‌న‌యుడు లోకేష్ రాజ‌కీయ జీవితం కోసం చంద్ర‌బాబు తొలిసారి గాడిత‌ప్పార‌నే అప‌వాదును కూడా చంద్ర‌బాబు మూట‌గ‌ట్టుకున్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ఓ మ‌హిళా రెవెన్యూ అధికారిని జుట్టుప‌ట్టి ఈడ్చితే నిస్స‌హాయంగా చూస్తుండిపోయారు. గుంటూరులో ఓ ఇంజ‌నీరింగ్ విద్యార్ధిని ఆత్మ‌హ‌త్య చేసుకుంటే, త‌న‌వాళ్ల‌ను కాపాడుకునేందుకు చూసీచూడ‌న‌ట్టు వ‌దిలేశారు. ఇవ‌న్నీ కూడా చంద్ర‌బాబుకు ప్ర‌తికూల వాతావ‌ర‌ణాన్ని తీసుకొచ్చే అంశాల‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

    చంద్ర‌బాబు ఎన్నో వైఫ‌ల్యాలు..! వైసీపి కి క‌లిసొస్తాయా..?

    చంద్ర‌బాబు ఎన్నో వైఫ‌ల్యాలు..! వైసీపి కి క‌లిసొస్తాయా..?

    వ్య‌వ‌స్థ‌ల‌న్నీ త‌న మ‌నుషులు భ్ర‌ష్టు ప‌ట్టిస్తుంటే తాను మౌనంగా ఉండ‌ట‌మే బాబు చేసిన పొర‌పాటు అనేంత‌గా జ‌నాల్లో ఆవేద‌న మొద‌లైంది. విజ‌య‌వాడ ఫ్లైఓవ‌ర్ కూడా నాలుగేళ్ల‌లో పూర్తిచేయ‌లేని నిర్ల‌క్ష్యం అధికారుల‌దే అయినా.. దాని తాలూకూ శాపం నాయ‌కుడే అనుభ‌వించాల్సి వ‌చ్చింది. అర‌కు ఎమ్మెల్యేను మావోయిస్టులు దారుణంగా హ‌త‌మార్చ‌టానికి అక్ర‌మ బాక్సైట్ త‌వ్వ‌కాలే కార‌ణ‌మంటూ పాల‌కుల త‌ప్పుల‌ను వేలెత్తిచూపారు.

    జ‌గ‌న్ పై అదే మ‌చ్చ‌..! దాని ఆధారంగా మ‌ళ్లీ ప్ర‌చారం చేయాల‌నుకుంటున్న టీడిపి..!!

    జ‌గ‌న్ పై అదే మ‌చ్చ‌..! దాని ఆధారంగా మ‌ళ్లీ ప్ర‌చారం చేయాల‌నుకుంటున్న టీడిపి..!!

    తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లాదిరూపాయ‌లు దొంగ కంపెనీల‌తో దోచుకున్నారని జ‌గ‌న్ పై ప్ర‌ధాన ఆరోప‌ణ చేస్తున్నారు టీడిపి నేత‌లు. పుత్రుడు లాభం కోసం ఎంద‌రో అధికారుల‌ను బ‌లిప‌శువులుగా మార్చిన తండ్రిగా వైఎస్ చ‌రిత్ర‌లో త‌న‌కున్న ఇమేజ్‌ను చెరిపేసుకున్నారంటూ ఎన్నిక‌ల్లో ల‌బ్ది పొందేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు తెలుగు త‌మ్ముళ్లు. ఏపీ ప్ర‌జ‌లు అవినీతి అంటే చీద‌రించుకుంటే.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ 67 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటుందా అనే అనుమానం కూడా త‌లెత్తుతుంది. ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు కావాల్సింది, గెలిచాక, అదికారంలోకి వ‌చ్చాక ప్ర‌జ‌ల‌కోసం ఏం చేస్తార‌నే పాయింట్ మాత్ర‌మే.

    పుంజుకున్న వైసీపి..! ప్ర‌జా తీర్పు పై నెల‌కొన్న ఉత్కంఠ‌..!!

    పుంజుకున్న వైసీపి..! ప్ర‌జా తీర్పు పై నెల‌కొన్న ఉత్కంఠ‌..!!

    త‌ర‌చూ జ‌గ‌న్ అవినీతి ప‌రుడంటూ ప్ర‌చారం చేస్తే, టీడీపీ 175 సీట్లు గెలుచుకుంటుందా అనేదే ఇప్పుడుహాట్ టాపిక్ గా మారింది. ప్ర‌జా బ‌లం ఉన్న‌ప్పుడు ఎవ‌రైనా అదికారంలోకి రావ‌చ్చ‌నే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. అవినీతిప‌రులు అధికారంలోకి రాకూడ‌ద‌నే నియ‌మం మాత్రం ఎక్క‌డా లేదు. ఏపిలో చంద్ర‌బాబు-జ‌గ‌న్ ప‌రిస్థితి ఇలా ఉంటే జ‌న‌సేన అదినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు అవ‌కాశం ఇవ్వొచ్చుక‌దా అనుకుంటే అదికూడా అసాద్యం గానే క‌నిపిస్తోంది. అనుభ‌వం ఉన్న పార్టీలే ఇలా చేస్తే.. అనుభ‌వం లేని నాయ‌కుడిగా రేపు తాను ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారు.. అవి త‌మ మెడ‌కు గుదిబండ‌గా మార‌తాయ‌నే ఆందోళ‌న కూడా జ‌నం వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+