చీప్ లిక్కర్ కు స్పెషల్ బ్యూరో పెట్టిన జగన్, రద్దు చేసిన చంద్రబాబు సర్కార్
గత వైసీపీ ప్రభుత్వంలో గుడ్డిగా తీసుకున్న నిర్ణయాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెక్ పెడుతున్నారు. ముఖ్యంగా ఎక్సైజ్ శాఖలో గత వైసీపీ ప్రభుత్వం లో తీసుకున్న అడ్డదిడ్డమైన నిర్ణయాలను కూటమి ప్రభుత్వం పక్కన పెడుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖను మరింత బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ఏర్పాటు చేశారు. ఎక్సైజ్ శాఖ లోని పలువురు ఉద్యోగులను ఈ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో విభాగానికి పంపించారు. అక్రమ మద్యం సరఫరా, నాటు సారా నియంత్రణ కోసం ఈ ఉద్యోగులు ఎక్కువ మంది స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో విభాగంలో పనిచేశారు. ఎక్సైజ్ శాఖలో సుమారు 70 శాతం మంది ఉద్యోగులను ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో విభాగానికి పంపించారు.

అయితే గత వైసీపీ ప్రభుత్వం లో మద్యం విక్రయాలు విషయాల్లో ఆ ప్రభుత్వమే అవినీతికి పాల్పడడంతో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో సిబ్బంది చేతికి పని లేక ఖాళీగా ఉండే వాళ్ళని ఆరోపణలు కూడా ఉన్నాయి. కొన్ని సంవత్సరాల పాటు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోలో పనిచేస్తున్న ఎక్సైజ్ శాఖ ఉద్యోగులను మళ్లీ అదే శాఖలోకి విలీనం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంలో అక్టోబర్ ఒకటో తేదీ నుండి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది.
ఇలాంటి సమయంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోని కూటమి ప్రభుత్వం రద్దు చేయడంతో ఎక్సైజ్ శాఖలోని ఉద్యోగులు హ్యాపీగా ఉన్నారని తెలిసింది. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దులోని కర్నూలు, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం జిల్లాలో చాలా మంది సీఐలు మళ్లీ అదే శాఖలోకి వచ్చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ లోనే స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ఏర్పాటు చెయ్యడం వలన ఒరిగింది ఏమీ లేదని అదే శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి అంటున్నారు.

స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో స్థాపించి ఆ శాఖలోని ఉద్యోగులను అక్కడికి బదిలి చేయడంతో ఇంతకాలం పొరుగు రాష్ట్రాల్లో నుండి వచ్చే అక్రమ మద్యాన్ని ఎక్సైజ్ శాఖ సమర్థవంతంగా అడ్డుకోలేకపోయిందని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోని మళ్లీ ఎక్సైజ్ శాఖలో విలీనం చేయడంతో ఆ శాఖ మరింత బలోపేతం అవడానికి అవకాశం ఉంటుందని ఎక్సైజ్ శాఖలోని ఓ సీనియర్ అధికారి అంటున్నారు. కర్ణాటక నుంచి వచ్చే చీప్ లిక్కర్ ను పట్టుకోవడానికి ఓ స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చెయ్యడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications