జగన్ గురువుకు జర్క్ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం, రివర్స్ గేమ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు విషయాలలో ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా విశాఖలోని శారదా పీఠానికి గత వైసీపీ ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ ఆయన గురువు స్వరూపానేంద్ర స్వామిజీ కోరిన కోరికలను తీర్చారని ఆరోపణలు ఉన్నాయి.
భీమిలి పట్టణం సమీపంలోని కొత్తవలస గ్రామంలో సముద్రతీరంలో ఉన్న 15 ఎకరాల భూమిని జగన్ ప్రభుత్వం విశాఖ శారదా పీఠానికి అప్పగించింది. ఒక ఎకరా భూమిని కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే తీసుకుని ఆ భూమిని శారదా పీఠానికి ఇచ్చేసింది. భీమిలి సమీపంలోని ప్రాంతంలో ఒక ఎకరా భూమి రూ. 15 కోట్లకు పైగా ఉందని అధికారులు అంటున్నారు. అలాంటిది ఒక ఎకరా భూమి ఒక లక్ష రూపాయలు మాత్రమే వసూలు చేసింది.

అప్పటి వైసీపీ ప్రభుత్వం భీమిలి సమీపంలోని ఆ భూమిని శారదా పీఠానికి అప్పగించింది. ఆ సందర్బంలో అప్పటి జగన్ ప్రభుత్వంపై స్థానికులు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో స్థానికులు కూడా ఏమి అభ్యంతరం చెప్పలేక, అప్పటి జగన్ ప్రభుత్వాన్ని ఎదురించలేక సైలెంట్ గా ఉండిపోయారు. అయితే ఆ తర్వాత ఆంధ్రప్రదశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ శారదా పీఠానికి సంబంధించిన భూముల విషయంపై చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.
విశాఖ శారదా పీఠానికి కేటాయించిన భూములు వెనక్కి తీసుకోవాలని స్థానికులు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మనవి చేశారు. ఈ విషయంపై ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారులతో విచారణ చేయించింది. స్థానికంగా ప్రభుత్వ విలువ ప్రకారం ఎకరా భూమి రూ. 15 కోట్లు ఉందని సంబంధిత అధికారులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. వందల కోట్ల విలువైన భూమిని వెనక్కి తీసుకోవాలని బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శారదా పీఠానికి కేటాయించిన 15 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు.












Click it and Unblock the Notifications