ఎన్‌టీఆర్‌కు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. దేవర సక్సెస్ మీట్ రద్దు..
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తాజాగా నటించిన దేవర చిత్రం ఇటీవలే రీలీజై మంచి టాక్ అందుకుంది. ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ భారీ ఎత్తున థియేటర్లకు క్యూ కడుతున్నారు. రీలీజయిన ఫస్ట్ డే ఉన్నంత క్రేజ్ ఇప్పడు లేకపోయినా.. కలెక్షన్లు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఆదివారం వరకు బాగానే ఉన్న దేవర మూవీ కలెక్షన్స్ ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పట్టినట్లు సమాచారం. నేడు (అక్టోబర్ 2న) గాంధీ జయంతి సందర్భంగా సెలవు, ఆ మరుసటి రోజు నుంచి దసరా సెలవులు రావడంతో మరో వారం రోజులు థియేటర్లలో దేవర సందడి చేయనుంది. ఇక, తాజాగా ఎన్‌టీఆర్‌కు, ఎన్‌టీఆర్ అభిమానులకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. దేవర మూవీ సక్సెస్ మీట్ ను రద్దు చేసినట్లు నెట్టింట వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ విషయంపై ఇంతవరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు.
దేవర సినిమా సక్సెస్ ను అందుకున్న క్రమంలో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చెయ్యాలని మూవీ మేకర్స్ రెడీ అవుతున్నారు. కానీ సక్సెస్ మీట్ ఎప్పుడు? ఎక్కడ? అనేది తేలడం లేదు. అయితే, దేవర సినిమా తెలుగులో ప్రమోషన్స్ కూడా సరిగ్గా చెయ్యలేదు. ప్రీ రీలీజ్ ఈవెంట్ కూడా రద్దయిన సంగతి తెలిసిందే. కాబట్టి, తెలుగు రాష్ట్రాల్లోనే గ్రాండ్ గా దేవర సక్సెస్ ఈవెంట్ ను ప్లాన్ చెయ్యాలని మూవీ మేకర్స్ అనుకుంటున్నారు. అభిమానుల సమక్షంలో ఈ ఈవెంట్‌ను చేయాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 2 లేదా 3వ తేదీన దేవర సక్సెస్ మీట్ ఉండే అవకాశం ఉందని టీ టౌన్ వర్గాల్లో వార్తలు వినిపించాయి.

పర్మిషన్ ఇవ్వనీ ప్రభుత్వం..
కానీ ఇప్పుడు ఈ సక్సెస్ మీట్ క్యాన్సిల్ అయ్యిందంటూ వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం సక్సెస్ మీట్ ఈవెంట్‌కు ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదనే టాక్ వినిపిస్తోంది. ఈ ఈవెంట్ లో అయిన ఎన్‌టీఆర్‌ను చూడాలనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. ఈ న్యూస్ కేవలం ఎన్‌టీఆర్ అభిమానులకు మాత్రమే కాదు ఎన్టీఆర్ కు కూడా షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. మరి ఈ విషయంపై దేవర టీమ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. దేవర మూవీ విడుదలైన మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్ సొంతంచేసుకుంది. అయితే, ఎన్‌టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా థియేటర్ల దగ్గర భారీ ఎత్తున సందడి చేస్తున్నారు. దీంతో మూడు రోజుల్లోనే రూ.300 కోట్ల కలెక్షన్ వసూలు చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications