బకింగ్ హామ్ జలరవాణా ప్రాజెక్ట్...ఆంధ్రాకే కాదు ఇండియాకే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అవుతుందట....
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా నిర్మించ తలపెట్టిన బకింగ్‌హాం కెనాల్ వాటర్ ట్రాన్స్ పోర్ట్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ కే కాదు భారత దేశానికే ప్రత్యేక గుర్తింపు తెస్తుందంటున్నారు ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు. జలవనరులపై శాసన మండలిలో ఇచ్చిన హామీల అమలు కమిటీ చైర్మన్ గాలి ముద్దుకృష్ణమనాయుడు ఈ విషయం వెల్లడించారు.
హామీల అమలు గురించి కమిటీ హాలులో ముద్దు కృష్ణమనాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశం అనంతరం సమీక్ష వివరాలు మీడియాకు వెల్లడించారు. బకింగ్‌హాం కెనాల్ జల రవాణా ప్రాజెక్టును 560 కిలోమీటర్ల పొడవున పూర్తి చేసేందుకు రూ.9,465 కోట్లు వ్యయం అవుతుందని తెలిపారు.

వాటర్‌వేస్ అధారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం రూ.3,250 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టుకు తమిళనాడు కూడా ఆమోదం తెలపాల్సి ఉందన్నారు. సాగునీటి పథకాలకు సంబంధించి మొత్తం 24 హామీలను శాసన మండలిలో ఇచ్చారని, వాటిలో అయిదు ఇప్పటికే నెరవేరగా, మిగిలినవి పురోగతిలో ఉన్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications