జగన్ కు అనుకూలంగా ఉన్న కంపెనీలు బ్లాక్ లిస్ట్ లోకి, బ్యాండ్!!
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్, అక్రమంగా ఇసుక విక్రయాలు జరిపిన వారిపై నమోదు అయిన కేసులు ఇప్పటికే విచారణలో ఉన్నాయి. ఇప్పుడు సిలికా శాండ్, క్వార్జ్ అక్రమ తవ్వకాలు చేసి విక్రయాలు చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం పూర్తి సమాచారం బయటకు లాగింది. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
గత వైసీపీ ప్రభుత్వంలో నియమాలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడిన వ్యాపారులకు ఎట్టి పరిస్థితుల్లో లైసెన్సులు ఇవ్వకూడదని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే గనుల శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా సంబంధిత అధికారులకు ఈ ఆదేశాలు జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్వార్జ్, సిలికా శాండ్ అక్రమాలు చాలా జరిగాయని ఆరోపణలు ఉన్నాయి.

ఈ విషయంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలపై విచారణ జరిపిస్తోంది. అందులో ముఖ్యంగా లిక్కర్ స్కాం, ఇసుక స్కాం, భూ కుంభకోణాలు ఉన్నాయి. ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని క్వార్జ్, సిలికా శాండ్ క్వారీల విషయం బయటకు వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వంలో సిలికా శాండ్ అక్రమంగా తరలించడానికి అనుమతులు ఇచ్చిన అధికారుల వివరాలు సేకరిస్తున్నారు.
అనుమతి తీసుకున్న దానికంటే భారీ ఎత్తున సిలికా శాండ్ తరలించారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా సిలికా శాండ్, క్వార్జ్ తవ్వకాలకు పాల్పడిన కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. గత వైసీపీ ప్రభుత్వంలో నియమాలు పాటించిన కంపెనీలకు మాత్రమే ఇప్పుడు లైసెన్సులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.

గత వైసీపీ ప్రభుత్వంలో క్వార్జ్, సిలికా శాండ్ తవ్వకాలు జరిపిన కంపెనీలను మూడు విభాగాలుగా గుర్తించిన అధికారులు వారిలో కొందరికి మాత్రమే లైసెన్సులు ఇవ్వాలని, మిగిలిన వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే కాకుండా ఇతర ప్రాంతాలలో సిలికా శాండ్ తవ్వకాలు చేసిన వారిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ లో పెట్టేది.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications