తిరుపతిలో చంద్రబాబు ఎంత చేశాడు, జగన్ ఎంత చేశాడు చూడండి !!

గత వైసీపీ ప్రభుత్వం లో జరిగిన అవకతవకలు, అవనీతి అక్రమాలు మొత్తం బయటకు వస్తున్నాయి. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన తిరుమల పుణ్యక్షేత్రం సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనాలను అర్ధాంతరంగా నిలిపేసిన గత వైసీపీ నాయకులపైన తిరుపతి ప్రజలు మండిపడుతున్నారు. తిరుపతికి వచ్చే పర్యాటకులు, శ్రీవారి భక్తులు, రుయా ఆసుపత్రి రోగుల కోసం నిర్మించే భవనం పనులు నిలిచిపోయాయి.

అలిపిరి సమీపంలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన అత్యాధునిక భవనం నిర్మాణం పనులకి వైసీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదని, ఆ భవనం ప్రస్తుతం నిరుపయోగంగా పడివుందని స్థానికులు మండిపడుతున్నారు. తిరుమల శ్రీవారి భక్తుల కోసం నిర్మించాలని తలపెట్టిన భవనం 11 సంవత్సరాలు అయినా పూర్తి కాలేదని తిరుపతి ప్రజలు ఆరోపిస్తున్నారు.

The construction of a building for tourists near Alipiri has been stopped overnight

గతంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి ఈ పాపం చుట్టుకుంటుందని శ్రీవారి భక్తులు, పర్యాటకులు మండిపడుతున్నారు. తిరుపతి నగరంలోని రుయా ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఓ ఎకరా స్థలంలో పర్యాటక శాఖ శ్రీవారి భక్తుల కోసం బహుళ అంతస్తుల విశ్రాంతి భవనం నిర్మించాలని 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మనవి చేయడంతో అప్పటి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అప్పట్లో 17 కోట్ల ఖర్చుతో ఈ భవనం నిర్మించాలని ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ భవనం కోసం రూ. 11 కోట్లు మంజూరు చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. తర్వాత ఈ భవనం అభివృద్ధి పనులు మరుగునపడిపోయాయి. ఇప్పటికే ఈ భవనంలో 103 విశ్రాంతి గదులతో పాటు అత్యాధునిక సమావేశ మందిరం, పర్యాటకశాఖ డివిజనల్ కార్యాలయం, కేంద్రీయ విచారణ కార్యాలయం ఇందులో ఏర్పాటు చేయాలని అప్పట్లో ఈ భవనానికి శంకుస్థాపన చేశారు.

అయితే జగన్ ప్రభుత్వంలో నిధులు మంజూరు కాకపోవడంతో అలిపిరి సమీపంలోని రుయా ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఈ విశ్రాంతి భవనం అభివృద్ధి పనులు మరుగున పడ్డాయి. ఇప్పుడు ఈ భవనం నిర్మాణానికి తిరుపతి కార్పొరేషన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, క్లీన్ సర్టిఫికెట్ వస్తే గాని ఈ పనులు పూర్తి చేయలేమని సంబంధిత పర్యాటక శాఖ అధికారులు అంటున్నారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జోక్యం చేసుకొని పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+