Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జూ ఎన్టీఆర్ మౌనం వెనుక, మద్దతెవరు - ఫిక్స్ అయినట్లేనా..!!

చంద్రబాబు (Chandra Babu)అరెస్ట్ తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారింది. రాజకీయ - సినీ ప్రముఖులు స్పందించారు. రాజకీయంగా చర్చ సాగుతోంది. న్యాయ స్థానాల్లో పోరాటం జరుగుతోంది. ఈ సమయంలో నందమూరి కుటుంబం(Nandamuri Family) చంద్రబాబుకు మద్దతుగా నిలిచింది. బాలయ్య(Balakrishna) గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) మాత్రం మౌనం వీడలేదు. దీని వెనుక కారణం ఏంటి. ఎవరు డ్రైవ్ చేస్తున్నారనే చర్చ మొదలైంది.

చంద్రబాబు అరెస్ట్ తో : చంద్రబాబు అరెస్ట్ తో నందమూరి..నారా కుటుంబ సభ్యులు బయటకు వచ్చారు. చంద్రబాబు(Chandra Babu)కు మద్దతుగా నిలిచారు. బీజేపీలో ఉన్న పురందేశ్వరి సైతం స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ తీరును ఖండించారు. కానీ, నందమూరి వారసుడిగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) ఎక్కడా ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు.

The Enigmatic Silence: Unraveling the mystery behind Junior NTRs reaction to Chandrababus Arrest

గతంలో చోటు చేసుకున్న కొన్ని అంశాలపైన సోషల్ మీడియా వేదికగా తారక్ స్పందించారు. ఆ స్పందన ల పైన టీడీపీ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కొందరు నేరుగా తారక్(Tarak) ను టార్గెట్ చేసారు. ఆ విమర్శలపైన జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. చంద్రబాబు..లోకేశ్ సభలు..యువగళం వేళ జూ ఎన్టీఆర్ కు అనుకూలంగా ఫ్లెక్సీలు కనిపించాయి.

ఆ హీరోలు స్పందించినా : చంద్రబాబు అరెస్ట్ పై సూపర్ స్టార్ రజనీ కాంత్(Rajini Kanth) స్పందించారు. నారా లోకేశ్(Nara Lokesh) కు ఫోన్ చేసి పరామర్శించారు. అదే విధంగా మరో హీరో విశాల్ సైతం సానుకూలంగా మాట్లాడారు. నందమూరి బాలయ్య ఈ వ్యవహారం లో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అటు పవన్ కల్యాణ్ తో కలిసి జైలులో చంద్రబాబును కలిసిన తరువాత టీడీపీ, జనసేన పొత్తు ప్రకటన జరిగింది.

ఆ సమయంలోనూ పవన్(Pawan Kalyan) తో కలిసి పని చేస్తామని ప్రకటన చేసారు. తాజా అసెంబ్లీ సమావేశాల్లోనూ రెండు రోజులు బాలయ్య కేంద్రంగా సమావేశాల్లో రచ్చ సాగింది. అసెంబ్లీ(Asembly)లో ఎప్పుడూ తన పని అన్నట్లుగా వ్యవహరించే బాలయ్య ఈ సారి అందుకు భిన్నంగా మీసాలు తిప్పటం.. చంద్రబాబు కూర్చొనే కుర్చీ మీదకు ఎక్కి విజిల్స్ వేస్తూ హంగామా చేసారు.

The Enigmatic Silence: Unraveling the mystery behind Junior NTRs reaction to Chandrababus Arrest

తారక్ ఆలోచన వెనుక : ఇదే సమయంలో జూ ఎన్టీఆర్ మాత్రం మౌనం వీడలేదు. దుబాయ్ పర్యటన ముగించుకొని వచ్చిన తరువాత దేవర(Devara) షూటింగ్ లో బిజీ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ అయి రెండు వారాలు అవుతోంది. రాజకీయ అంశంగా చూస్తన్నారా.. లేక, వివాదాల్లో జోక్యం చేసుకోకూడదని భావిస్తున్నారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. తారక్(Tarak) తో పాటుగా సోదరుడు కల్యాణ రాం సైతం స్పందించలేదు.

టీడీపీలో 2014 నుంచి తారక్ విషయంలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగానే ఇప్పుడు పూర్తిగా రాజకీయాలను వదిలేసి..సినిమాలపైన ఫోకస్ చేసారనే అభిప్రాయం ఉంది. చంద్రబాబు అరెస్ఠ్ అయినా స్పందించని చంద్రబాబు ఇక నారా నాయకత్వంలో టీడీపీ(TDP)లో యాక్టివ్ భవిష్యత్ లోనూ అయ్యే అవకాశం లేదని..ఆ విధంగా ఫిక్స్ అయిపోయినట్లేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+