ఏడు కొండలస్వామి సాక్షిగా అక్కడ అదే జరిగితే ? గల్లుమంది ‘గ్లాసు’ ఓ బాసు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ఎలాంటి అంతరాయం లేకుండా కొనపాగుతోంది. బ్యాలెంట్ ఓట్ల మీద నమ్మకం లేకుండా కోర్టును ఆశ్రయించిన వైసీపీ నాయకులకు ఉద్యోగులు వారి పవర్ చూపించారని స్పష్టంగా వెలుగు చూసింది. ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అధికార వైసీపీకి వణుకు పుట్టిస్తున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని ఇప్పటికే పలు నియోజక వర్గాల్లో వెలుగు చూసింది.
ముఖ్యంగా ఏడు కొండలస్వామి కొలువు తీరిన తిరుపతి జిల్లాలో ఉద్యోగులు అధికార వైసీపీకి ఝలక్ ఇచ్చారని తెలిసింది. తిరుపతి జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో 22, 795 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిగిలిన ఉద్యోగులు పోలింగ్ రోజు ఓటు వేశారు. తిరుపతి జిల్లాలో 22, 795 మంది ఉద్యోగులు వైసీపీ నాయకులకు ఊహించని షాక్ ఇచ్చారని తెలిసింది.

తిరుపతి జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజక వర్గాల్లో సోస్టల్ బ్యాలెట్ ప్రభావం పడుతుందని తెలిసింది, తిరుపతిలో 4, 766 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, చంద్రగిరిలో 5,187 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకున్నారు. ఈ రెండు నియోజక వర్గాల్లోని ఉద్యోగులు అధికార వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని ఆ పార్టీ నాయకులకు వణుకు మొదలైయ్యింది. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లాలో తిరుపతి, చంద్రగిరి నియోజక వర్గాల ఫలితాలపై అందరికి ఉత్కంఠ నెలకొంది.
తిరుపతి జిల్లా పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఉద్యోగులు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆ పార్టీ నాయకులు బిత్తరపోయారు. కౌంటింగ్ లో చిన్నపాటి తేడా ఉన్నా అభ్యంతరం వ్యక్తం చెయ్యాలని ఇప్పటికే వైసీపీ నాయకులు ఆ పార్టీ ఏజెంట్లకు మార్గనిర్దేశం చేసిన విషయం తెలిసిందే, ఈ నేపథ్యంలో తమకు వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయని కౌంటింగ్ కు ముందే వైసీపీకి అనుమానం రావడంతో బ్యాటెల్ ఓట్ల విషయంో రాద్దాంతం చేశారని ప్రజలు అంటున్నారు.
అందుకే బ్యాలెట్ ఓట్ల చెల్లుబాటు విషయంలో పోలింగ్ జరిగిన మరుసటి రోజు నుంచి వైసీపీ నాయకులు బహరంగంగానే ఉద్యోగుల ఓట్ల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చూస్తూనే ఉన్నాయి. మీడియా సమావేశాలు పెట్టి బ్యాలెట్ ఓట్ల విషయంలో ఈసీ మాకు అన్యాయం చెయ్యాలని చూస్తోందని చాలా మంది వైసీపీ నాయకులు బహిరంగంగానే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications