TTD: తిరుమలలో ఆగమశాస్త్ర నిబంధన ఉల్లంఘన..!!
Tirumala: తిరుమలలో ఆగమశాస్త్ర నిబంధన ఉల్లంఘన జరిగింది. తిరుమల కొండ పైన శ్రీవారి ఆలయం సమీపంలో హెలికాప్టర్ వెళ్లటం కలకలం రేపుతోంది. గతంలోనూ ఇదే విధంగా జరిగిన తరువాత టీటీడీ అధికారులు కేంద్రానికి ఫిర్యాదులు చేసారు. తిరుమలను నిబంధనలకు వ్యతిరేకంగా విమానాలు..హెలికాప్టర్ల కు అవకాశం లేకుండా చూడాలని అభ్యర్ధించారు. ఇప్పుడు మరోసారి ఆలయం సమీపంగా హెలికాప్టర్ వెళ్లటం పైన భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలకు వ్యతిరేకం
ఆగమశాస్త్ర నిబంధనల మేరకు తిరుమల కొండపై నుంచి హెలికాప్టర్ వెళ్లకూడదు. కానీ, తాజాగా ఆలయ సమీపంలో హెలికాప్టర్ వెళ్లటాన్ని అధికారులు గుర్తించారు. ఈ విమానం గురించి టీటీడీ అధికారులు ఆరా తీశారు. ఈ విమానం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానంగా అధికారులు చెప్పారు. గతంలోనూ శ్రీవారి ఆలయానికి సమీపంలో గగన తలంపై హెలికాప్టర్లు ప్రయాణంచాయి. ఆగమశాస్త్ర నిబంధనకు వ్యతిరేకంగా మీదుగా ఇవి తిరగటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో అప్రమత్తమైన తిరుమల తిరుపతి దేవస్థానం హెలికాప్టర్ గురించి వివరాలు ఆరా తీస్తున్నారు.

భక్తుల అభ్యంతరం
తిరుమల నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని చాలా కాలంగా కోరుతున్నారు. ఇప్పుడు ఆలయం పరిసరాల మీదుగా హెలికాప్టర్ ఎగరడంతో ఈ చర్చ మరోసారి తెర మీదకు వచ్చింది. గతంలో కొండ పైన ఉన్న తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పరకామణి భవనం, బాలాజీనగర్ ఉపరితలంపై నుంచి హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. ఇలా తరచూ తిరుమల కొండపై హెలికాప్లర్లు ఎగరడంపై భక్తులు విస్మయానికి గురయ్యారు. దీని పైన టీటీడీ అధికారులు ఆరా తీసారు. ఈ హెలికాప్టర్లు తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంలో వెళ్లటం పైన అభ్యంతరం వ్యక్తం చేసారు.
టీటీడీ కసరత్తు
గతంలో ఇదే విధంగాహెలికాప్టర్లు తిరగటం పైన గతంలోనే టీటీడీ అధికారులు రేణిగుంటలోని విమానాశ్రయం అధికారులను సంప్రదించారు. ఆ హెలికాప్టర్లు భారత వాయుసేనకు చెందినవిగా సమాచారం ఇచ్చారు. కడప బేస్ క్యాంపు నుంచి చెన్నైకి వెళ్తున్న సమయంలో ఇటుగా వచ్చినట్లు వివరించారు. తిరమల మీదుగా విమానాలు, హెలికాప్టర్లు వెళ్లకుండా చూడాలని కేంద్రానికి గతంలోనే టీటీడీ కోరింది. అయితే, ఇప్పటికీ తిరుమల ను నో ఫ్లయింగ్ జోన్ గా అధికారికంగా కేంద్ర విమాన యాన శాఖ గుర్తించలేదని చెబుతున్నారు. ఆగమశాస్త్ర నిబందనకు వ్యతిరేకమని చెబుతున్న వేళ.. కేంద్రం పైన ఒత్తిడి తెచ్చి నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటన వచ్చేలా వ్యవహరించాలని భక్తులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications