ఏపీలో మెగా డీఎస్సీపై బిగ్ అప్డేట్..!!

ఏపీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహిస్తామ ని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. గెలిచిన తరువాత ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ రోజున (బుధవారం) నోటిఫికేషన్ విడుదల పైన సంకేతాలు ఇచ్చారు. కానీ, చివరి నిమిషంలో నిర్ణయం మారింది. ఈ రోజు విడుదల చేయాల్సిన మెగా డీఎస్సీ ప్రకటన వాయిదా పడింది. త్వరలోనే విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.

ఏపీలో మెగా డీఎస్సీ ప్రకటన వాయిదా వేసారు. అనివార్య కారణాలతో నోటిఫికేషన్ వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మరో నాలుగు లేదా అయిదు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పుకొచ్చారు. మెగా డీఎస్సీ నిర్వహణ పైన మంత్రి లోకేష్ సమీక్ష చేసారు. పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. డీఎస్సీలో సాధ్యమైనంత ఎక్కువ మంది అభ్యర్థులకు అవకాశం కల్పించాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. డిసెంబరు మొదటి వారంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.

The highly anticipated Mega DSC notification in Andhra Pradesh has been postponed

రాష్ట్రంలోని 26 జిల్లాలను నాలుగు జోన్లుగా విభజించి విద్యార్ధులు అందించే మధ్నాహ్న భోజనం మెనూలో మార్పులు చేయాలని అధికారులను లోకేష్ ఆదేశించారు. అదే విధంగా మండలానికి ఒక జూనియర్ కాలేజీ ఏర్పాటు దిశగానూ కసరత్తు జరుగుతోంది. ఇంటర్ పరీక్షల వాల్యూయేషన్ ఇక ఏఐ ద్వారా చేసే అంశం పైన అధికారులకు సూచనలు చేసారు. గ్రామీణ ప్రాంతాల్లో జూనియర్ కాలేజీల ఏర్పాటుకు వీలుగా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+