భోగాపురంలో ల్యాండైన తొలి విమానం, కల సాకారం- ఎన్నో ప్రత్యేకతలు..!!
విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్ అయింది. ఉత్తరాంధ్ర ప్రజల సుదీర్ఘ కల సాకారం అయింది. భోగాపురం విమానాశ్రయాన్ని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 96 శాతం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినట్లు జీఎంఆర్ సంస్థ వెల్లడించింది. ఇక భోగాపురం ఎయిర్‌పోర్టును జూన్ 26వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ విమానాశ్రయం ద్వారా విశాఖ - విజయనగరం జంట నగరాలు గా రూపుదిద్దుకోనున్నాయి. ఈ విమానాశ్రయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండ్ అయ్యింది. వ్యాలిడేషన్ (టెస్ట్) ఫ్లైట్ ఢిల్లీ నుంచి భోగాపురం వచ్చింది. ఈ విమానంలో పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏటీసీ చైర్మన్ తొలి విమానంలో ప్రయాణించారు. భోగాపురం విమానాశ్రయాన్ని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మాణం చేస్తున్నారు. ఇప్పటికే 96 శాతం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినట్లు జీఎంఆర్ సంస్థ వెల్లడించింది. ఇక భోగాపురం ఎయిర్‌పోర్టును జూన్ 26వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ టెస్ట్ ఫ్లైట్ విజయ వంతం కావడంతో త్వరలోనే ఈ ప్రాంతం నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖపట్నం దక్షిణ భారతదేశంలోనే ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారనుంది.

దేశంలో స్మార్ట్ ఎయిర్‌పోర్టుగా అంతర్జాతీయ వసతులతో దీని నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకు న్నామని జీఎంఆర్ ప్రతినిధులు తెలిపారు. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు పర్యవేక్షణలో పనులు శరవేగంగా చేపట్టాం. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన మౌలిక వసతులు కల్పించి సహకరించిందని చప్పారు. 21 ఆధునిక ఏరో బ్రిడ్జిలు..గంటకు 10-12 విమానాలు దిగుతాయని వివరించారు. తొలి ఏడాది 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. సెల్ఫ్ బ్యాగేజీ, బోర్డింగ్, సెల్ఫ్ చెకిన్, స్మార్ట్ ట్రాలీలు తదితర ఆధునిక వసతులు ఉంటాయి. విమానాశ్రయం టెర్మినల్ లోపల విప్లవవీరుడు అల్లూరి సీతారామ రాజు విగ్రహం, ఏటికొప్పాక బొమ్మలు ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా అలంకరణలకు నిర్ణయించారు. తొలి దశలో రూ.4,725 కోట్లతో ప్రాజెక్టు పనులు చేపట్టాం. జులై తొలి వారం నుంచి అధికారికంగా విమానాల రాకపోకలు ఉంటాయి. రోజుకు 200 విమానాలు దిగే సామర్థ్యం ఉంది. ఏటా 20 వేల టన్నుల సరకు ఎగుమతులకు అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications