• search

అవినాశ్: నిన్న జగన్ పార్టీలో, రెండేళ్లు తిరిగేసరికి ట్రంప్‌కు ప్రచారం

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  వాషింగ్టన్/విజయవాడ: అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న రిపబ్లికన్ పార్ట అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నెగ్గితే.. ఆయన గెలుపులో ఓ తెలుగు వ్యక్తి పాత్ర కూడా ఉంటుంది. అతనే అవినాశ్ ఇరగవరపు. ఇతను అరిజోనా రిపబ్లికన్ పార్టీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.

  ఎవరీ అవినాశ్?

  అవినాశ్ తూర్పు గోదావరగి జిల్లా కొవ్వూరుకు చెందిన వ్యక్తి. ఇతను ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. ఐఐఎం లక్నోలో చదువుకున్నాడు. అతని తాత స్థానిక (ఏపీ) రాజకీయాల్లో చిన్నప్పటి నుంచే ఉండేవారు. అవినాష్‌కు కూడా రాజకీయాలు అంటే మక్కువ ఏర్పడింది. ఇతని వయస్సు 30.

  ఐఐఎం లక్నో నుంచి ఎంబీయే పూర్తి చేసిన అనంతరం అతను హెచ్‌సీఎల్‌లో ఉద్యోగం పొందాడు. 2014 ఎన్నికల సమయంలో ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచార బాధ్యతలు నిర్వహించారు. ఓటర్లను మోటివేట్ చేయడం, వందలాది ప్రచారాలు నిర్వహించడం, కార్యకర్తలను సమకూర్చడం.. ఇలా చేశారు. ఆ ఎన్నికల్లో వైసిపి గెలవలేదు. అది వేరే విషయం.

  2014 ఎన్నికల అనంతరం అతను అరిజోనా వెళ్లారు. అక్కడ అతని భార్య ఉంటున్నారు. భార్యను చూసేందుకు వెళ్లారు. కొన్నాళ్లకు అతను తిరిగి భారత్ రావాలనుకున్నారు. ఆదే సమయంలో ఓ అవకాశం అతనిని భారత్ రాకుండా ఆపింది.

  అమెరికాలో జరుగుతున్న లోకల్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డాగ్ డ్యూసీ నామినేషన్ వేశారు. ఆ సమయంలో అవినాశ్ డేటా స్కిల్స్ ఉపయోగపడ్డాయి.

  అవినాష్ తన ఎన్నికల వ్యూహంతో డ్యూసీ గెలుపు సాధిస్తారని ధీమాగా చెప్పారు. అదే నిజమైంది. అవినాష్ ఎన్నికల వ్యూహం రిపబ్లికన్ పార్టీ చైర్మన్ రాబర్డ్ గ్రహం వరకు చేరింది. అతను ఇంప్రెస్ అయ్యాడు. అవినాశ్‌ను డేటా డైరెక్టర్ చేశారు. ఆ తర్వాత పొలిటికల్ డైరెక్టర్, అనంతరం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయ్యారు. ఏడాది వ్యవధిలోనే అతను ఎదిగాడు.

  అవినాష్ ఇరగవరపు

  అవినాష్ ఇరగవరపు

  అవినాష్ ఇరగవరపు రెండేళ్ల క్రితం, సార్వత్రిక ఎన్నికల సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని హెచ్‌సీఎల్ ఉద్యోగం వదులుకొని ఆయన వైసిపిలో చేరారు.

  అవినాష్ ఇరగవరపు

  అవినాష్ ఇరగవరపు

  అవినాశ్ ఇరగవరపు ఏడాది రెండేళ్ల క్రితం ఏపీలో ఎన్నికల సమయంలో అందరిలాగే సాధారణంగా.. పాంప్లెట్లు పంచడం, ఇంటింటికి వెళ్లి ఎన్‌రోల్ చేశారు.

  అవినాష్ ఇరగవరపు

  అవినాష్ ఇరగవరపు

  రెండేళ్ల తర్వాత చూస్తే.. అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్ట్ ట్రంప్ తరఫున ఇప్పుడు అవినాష్ ప్రచార బాధ్యతలు నెత్తిన పెట్టుకున్నారు.

   అవినాష్ ఇరగవరపు

  అవినాష్ ఇరగవరపు

  అవినాశ్ సతీమణి అరిజోనాలో ఇంటెల్‌లో పని చేస్తున్నారు. 2014 ఎన్నికల అనంతరం ఏపీ నుంచి సెలవులు తీసుకునే నిమిత్తం అమెరికా వెళ్లారు. అక్కడ భార్య ఉండటంతో వెళ్లారు. అరిజోనాలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ 47.1 శాతం ఓట్లతో గెలుపొందారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  If Donald Trump succeeds in his race for the White House, then this Telugite must be some how credited. Meet Avinash Iragavarapu, executive director for the Arizona Republican Party.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more