లడ్డూ కేసు విచారణలో బిగ్ ట్విస్ట్ - దొరికిపోయిన రింగ్ మాస్టర్ ..!!
తిరుమల లడ్డూ కేసు విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సిట్ కీలక ఆధారాలు సేకరించింది. ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసింది. ఈ విచారణలో పాత్రధారులను గుర్తించింది. వారి నుంచి సూత్రధారులను తేల్చే ప్రక్రియను సిట్ మొదలు పెట్టింది. గతంలో కీలక వ్యవహరించిన ఓ కీలక అధికారితో పాటుగా పాలకమండలికి చెందిన ముఖ్యుడిని ఒకరిని విచారణకు పిలిచేందుకు నోటీసులు జారీ చేయనున్నారు. వీరి విచారణ సమయం లో అనూహ్య నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది.
కీలక పరిణామాలు
కలకలం రేపిన తిరుమల లడ్డూ కల్తీ ఘటన విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ ఘటన పైన పెద్ద ఎత్తున దుమారం చెలరేగటంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ విచారణ మొదలు పెట్టింది. ఇప్పటి వరకు విచారణలో భాగంగా 12 మంది టీటీడీ అధికారులతో పాటుగా ఇతరుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. అందులో భాగంగా కీలక బాధ్యతలు నిర్వ హించిన ఇద్దరి ప్రముఖులను విచారణకు పిలిచేందుకు సిట్ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని అరెస్టులు ఉంటాయని భావిస్తున్నారు. ఇప్పటికే అరెస్ట్ చేసిన ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖర్.. భోలేబాబా డెయిరీ డైరెక్టర్లను కస్టడీలోకి తీసుకున్న సిట్ విచారణ చేస్తోంది.

పక్కా ఆధారాలు
అయితే, విచారణ సమయంలో అరెస్ట్ అయిన నలుగురినీ వేర్వేరుగా ప్రశ్నించినా.. నలుగురూ కూడబలుక్కున్నట్లు ఒకే రకమైన సమాధానం ఇస్తున్నట్లు తెలుస్తోంది. విచారణ వేళ పలు సంద ర్భాల్లో నిందితులే సిట్ అధికారులను ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నాలుగు నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించినట్టు టీటీడీ ఎప్పుడు సమాచారం ఇచ్చిందనే కోణంలో సిట్ అధికారులు ఆరా తీసారు. అయితే, తాము టీటీడీకి నెయ్యే సరఫరా చేయలేదని, ఇక తిరస్కరించినట్టు టీటీడీ తమకు ఎందుకు సమాచారం ఇస్తుందని వారు ఎదురు ప్రశ్నించిన ట్టు తెలుస్తోంది. నాణ్యత లేదన్న కారణంగా టీటీడీ నెయ్యిని తిరస్కరించిందని తమకు వైష్ణవి డెయిరీ ప్రతినిధుల నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందిందని చెప్పినట్టు సమాచారం.
ఇద్దరి పై గురి
ఇక.. కేసు విచారణ పైన సీబీఐ అధికారులు సమావేశమై ఇప్పటి వరకు వచ్చిన సమాచారం.. సిట్ భవిష్యత్ విచారణ పైన సమీక్ష నిర్వహించారు. విచారణ కొనసాగింపు పైన ముఖ్య అధికారులు మార్గ నిర్దేశం చేసారు. టీటీడీ అధికారులు, పాలకమండలికి సంబంధించిన వ్యక్తులను ఎవరెవ రిని విచారించాలో ఒక నిర్ణయానికి వచ్చారు. కల్తీ నెయ్యి సరఫరాలో టీటీడీ పరంగా 12 మంది ప్రమేయం ఉందని సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. వీరిని విచారించే అవకాశం ఉంది. విచారణ లో భాగంగా ప్రతీ అంశం పైన లోతుగా సమాచారం తో పాటుగా ఆధారాలు సేకరిస్తూ సిట్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విచారణ పూర్తి అయ్యేందుకు మరో రెండు నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications