గూడవాండ్లపల్లెలో కుంగుతున్న భూమి: ఆందోళనలో గ్రామస్థులు
చింతకొమ్మదిన్నే మండలం బుగ్గ వంక ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలోని గూడవాండ్లవారిపల్లెలో మళ్ళీ భూమి కుంగుతోంది. రైతుదస్తగిరిరెడ్డి పొలంలో 40 అడుగుల లోతు, 30 అడుగుల వెడల్పుతో భారీ గొయ్యి ఏర్పడింది.
కడప: చింతకొమ్మదిన్నే మండలం బుగ్గ వంక ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలోని గూడవాండ్లవారిపల్లెలో మళ్ళీ భూమి కుంగుతోంది. రైతుదస్తగిరిరెడ్డి పొలంలో 40 అడుగుల లోతు, 30 అడుగుల వెడల్పుతో భారీ గొయ్యి ఏర్పడింది.
రెండు పెద్ద మామిడి చెట్లు ఆ గోతిలో పడి కనిపించకుండా పోయాయి. దీంతో ఎక్కడ గోతులకు బలికావలసి వస్తుందోనని రైతులు పొలం వైపు వెళ్లాలంటే బెంబేలెత్తి
పోతున్నారు.

ముఖ్యంగా రెండు సంవత్సరాలక్రితం ఇలాంటి పరిస్థితే తలెత్తగా.. దేశంలో పేరుమోసిన భూగర్భ శాస్త్రవేత్తలు ఇక్కడ కుంగుతున్న భూమికి గల కారణాలు స్పష్టంగా కనుగొని రైతులకి గ్రామప్రజలకు భరోసా ఇవ్వలేక పోయారు.
భారీ వర్షాలు కురియడంతో బుగ్గవంకకు వరద ప్రవాహంతో 1టీఎంసీ నీరు చేరిన మరుసటి రోజే ఈ విధమైన భారీ గోతులు ఏర్పడుతున్నాయి. దీంతో పొలంవైపుఅడుగు వేయాలంటే స్థానికులు హడలెత్తిపోతున్నారు.












Click it and Unblock the Notifications