• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మూగజీవాల మరణ మృదంగం..! అదికార పార్టీకి శాపగ్రస్తం..!!

|

అమరావతి/హైదరాబాద్ : చిన్న చిన్న మానవ తప్పిదాలు పెద్ద పెద్ద సమస్యలకు నాంది పలుకుతాయా అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి. అదికార పార్టీల చిన్న పాటి ఏమరుపాటువల్ల పెద్ద అనర్థాలు కొని తెచ్చుకునే పరిస్థితులు తెలెత్తుతున్నాయి. రాజమండ్రి 2015 గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది వరకూ అమాయకులు చనిపోయారు. తాడేపల్లి 2019 గోశాలలో 100 ఆవులు విషాహారంతో మరణించాయి. మొదటి పాపం.. టీడీపీ ఖాతాలో పడింది.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

మరి ఇపుడు గోవుల మరణం యావత్ దేశాన్ని కుదిపేస్తున్న అంశం. ఇంత పెద్ద ఎత్తున గోవులు మరణించటం రాష్ట్రానికి మంచిది కాదంటున్నారు వేదపండితులు. దీనికి పరిహారం చేయాలంటూ సూచిస్తున్నారు. కొద్దిసేపు అవన్నీ పక్కనబెడితే ఇంతకీ గోవులు ఎందుకు మరణించినట్టు అనే ప్రశ్నకు పశువైద్యులు కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.

జగన్ సర్కార్ మౌనం దేనికి సూచన..!!

జగన్ సర్కార్ మౌనం దేనికి సూచన..!!

పోస్టుమార్టం అనంతరం వాటి కడుపులో ఏమీ కనిపించలేదంటారు. కాదుకాదు.. విష ప్రయోగం జరిగిందంటారు. అలాగనీ.. విషం కాదు.. అవి తిన్న గడ్డిలో యూరియా పాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల అలా జరిగి ఉండవచ్చంటారు. అయితే సున్నితమైన అంశం.. ప్రజల ఎమోషన్స్ తో కూడుకున్నది కావటంతో అటు అధికారులు.. ఇటు ప్రభుత్వ యంత్రాంగం కూడా మౌనం వహిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే టీడీపీ విమర్శల బాణాలు సంధిస్తున్నాయి. బీజేపీ కూడా వైసీపీ తీరుపై గుర్రుగా చూస్తుంది. ఇప్పటికే జగన్ హిందు వ్యతిరేకిగా మారుతున్నారనే ఆరోపణలు ఊపందుకుంటున్నాయి. కేబినెట్ తో సహా మిగిలిన అంశాల్లోనూ హిందుత్వం అనే పదానికి దూరంగా జరుగున్నట్టుగా వినిపిస్తున్నాయి.

మనోభావాలకు సంబందించిన అంశం..! ఏపి ప్రభుత్వం ఎలా అదిగమిస్తుంది..!!

మనోభావాలకు సంబందించిన అంశం..! ఏపి ప్రభుత్వం ఎలా అదిగమిస్తుంది..!!

క్రైస్తవం నుంచి హిందూ మతం స్వీకరించిన జగన్ జెరూసలేం వెళ్లటాన్ని కూడా బీజేపీ సునిశితంగా పరిశీలిస్తుంది. ఇది తన వ్యక్తిగత పర్యటనగానే జగన్ మొదట్లో చెప్పారు. దేవాలయాలకు కూడా ప్రాధాన్యతనివ్వట్లేదంటూ బ్రాహ్మణసంఘాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. నిన్నటి వరకూ వెన్నంటి ఉన్న రిటైర్డు ఐఏఎస్ అధికారి ఐ.వై.ఆర్ క్రిష్ణారావు కూడా కనుమరుగయ్యారు. టీటీడీ పాలకమండలి నియామకంలోనూ జగన్ విమర్శలు చవిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో గోవుల మరణంపై జగన్ స్పందించకపోవటం.. అధికార యంత్రాంగం కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండటం కూడా ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతుందనే వాదన వినిపిస్తుంది.

గోవుల మరణం..! కుదిపేస్తున్న రాజకీయం..!!

గోవుల మరణం..! కుదిపేస్తున్న రాజకీయం..!!

అదీ కాకుండా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఏపీలో బలపడేందుకు వ్యూహం పన్నుతుంది. వైసీపీ మీద జనం పెట్టుకున్న అంచనాలను అందుకోలేక వైసీపీ నేతలు దిగాలు పడుతున్నారు. పోనీ అధినేత జగన్ సీఎం హోదాలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారా. అంటే అబ్బే అదీ కనిపించట్లేదు. ప్రతి చిన్న విషయానికి అటు ఎంపీ విజయసాయి రెడ్డి.. ఇటు రిటైర్డు ఐఎఎస్ అధికారి అజయ్ రెడ్డి కల్లం వైపు దిక్కులు చూడాల్సి వస్తుందనే ఆరోపణలు చవిచూస్తున్నారు.

 ప్రభుత్వానికి ప్రాణ సంకటం..! వివాదం నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు..!!

ప్రభుత్వానికి ప్రాణ సంకటం..! వివాదం నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు..!!

నిజంగానే జగన్ స్వేచ్ఛను కోరుకునే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారా. స్వతంత్రుడిగా నిలబడాలనే కాంక్షతోనే వైసీపీ పార్టీ స్థాపించారా అనే అనుమానాలు సొంత పార్టీ నేతల్లోనే వినిపిస్తున్నాయి. సంక్లిష్టత.. ప్రజల భావోద్వేగాలు.. మతపరమైన నమ్మకాలతో కూడి గోవుల సంరక్షణ. ఇప్పుడు సీఎం హోదాలో జగన్ కు సవాల్ గా మారాయనేది బహిరంగ రహస్యం. వీటి నుంచి ఎలా బయటపడతారు.. తాను హిందువుల బంధువునని చేతల్లో ఎలా నిరూపించుకుంటారనేది వైసీపీ ముందున్న ప్రశ్న. ఈ సున్నితమైన అంశాన్ని జగన్ ఎలా అదిగమిస్తారోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

English summary
Rajahmundry 2015 Godavari Pushkaru Stampede to 29 people died. 2019 cows died of poisoning at Thadapalli and 100 cows dead. The first sin went into TDP account, Had to pay a sufficient price. And now the death of the cows is a factor that is shaking the whole country. It is not good for the state that this large number of cows are dying.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X