విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆనందం కోసమే: విశాఖలో బాబు, చిన్నారితో(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: రైతుల కళ్లల్లో ఆనందం చూడటానికే రుణమాఫీ చేపట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం తుమ్మపాలెంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని స్పష్టం చేశారు. తన శరీరంలో చివరి రక్తపు బొట్టు వరకు రైతులకు మేలు చేస్తానని చెప్పారు.

ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే వరకు అందుబాటులో ఉంటానని చంద్రబాబు చెప్పారు. అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేపడతామన్నారు. అక్టోబర్ 2 నుంచి వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేస్తామని అన్నారు. ఆరోగ్యశ్రీ స్థానంలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి పేదలకు మెరుగైన వైద్యం అందజేస్తామని హామీ ఇచ్చారు.

పేదవాళ్లకు ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను నిర్మిస్తామని చంద్రబాబు తెలిపారు. పేదవాళ్ల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా రెండు నెలల్లోనే ఎన్నో అభివృద్ధి పనులు చేసినప్పటికీ కొంతమంది రోడ్లపైకి వస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. వీళ్ల గొడవలకు భయపడేది లేదన్నారు. ఐదళ్ల తర్వాత కరువు పరిస్థితులు కనపడవని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

చంద్రబాబు

చంద్రబాబు

విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలోని నూకాంభికా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న చంద్రబాబు.

చంద్రబాబు

చంద్రబాబు

విశాఖపట్నం విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతున్న పార్టీ కార్యకర్తలు, నాయకులు.

చంద్రబాబు

చంద్రబాబు

విశాఖపట్నం జిల్లాలోని ఎన్టీఆర్ ఆస్పత్రిలోని రోగులను పరామర్శిస్తున్న చంద్రబాబు నాయుడు.

చంద్రబాబు

చంద్రబాబు

అనకాపల్లిలోని నూకాంభికా ఆలయంలో చంద్రబాబుకు పూర్ణ కుంభ స్వాగతం పలుకుతున్న దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రిలోని సిబ్బందితో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు.

చంద్రబాబు

చంద్రబాబు

ఎన్టీఆర్ ఆస్పత్రిలోని వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు.

చంద్రబాబు

చంద్రబాబు

రైతుల కళ్లల్లో ఆనందం చూడటానికే రుణమాఫీ చేపట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రిలో శిశువును ఎత్తుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Friday said that the loan waiver scheme is for farmers happiness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X