సినిమా థియేటర్లలో ఎన్నికల ఫలితాలు..!!

ఎన్నికల ఫలితాల పై ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇప్పటికే పార్టీలు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పెద్ద ఎత్తున బెట్టింగ్స్ కొనసాగుతున్నాయి. ఎన్నికల ఫలితాల ను వీక్షించేందుకు ప్రధాన పార్టీలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. గెలుపు ఖాయమని నమ్ముతున్న పార్టీలు విజయోత్సవాలకు సిద్దం అవుతున్నాయి. ఈ సమయంలోనే ఎన్నికల ఫలితాలను ఈ సారి సినిమా థియేటర్లలో ప్రదర్శించేందుకు రంగం సిద్దమైంది.

ఫలితాలపై ఉత్కంఠ
దేశ వ్యాప్తంగా ఈ రోజున చివరి విడత పోలింగ్ జరుగుతోంది. సారి ఎన్నికలు చాలా ఆసక్తికరంగా ఉంటంతో అందరి దృష్టి ఫలితాలపై ఉంది. ఈ క్రమంలోనే ఫలితాలను కొందరు ప్రొజెక్టర్లు పెట్టి ప్రత్యక్ష ప్రసారం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే.. బిగ్ స్క్రీన్ పై ఎన్నికల ఫలితాలను చూడాలని కోరుకునే వారికి కూడా ఆ ఛాన్స్ దక్కనుంది. మహారాష్ట్రలోని కొన్ని సినిమా థియేటర్లు ఈ ఫలితాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు రెడీ అయ్యాయి. ముంబయి లోని ఎస్‌ఎం5 కల్యాణ్‌, సియాన్‌, కంజూర్‌మార్గ్‌లోని మూవీమ్యాక్స్‌ థియేటర్లలో ఈ ఫలితాలు ప్రసారం చేయనున్నాయి.

The Lok Sabha Election Results 2024 will be announced on June 4 and can be viewed in theatres

థియేటర్లలో ప్రదర్శన
అలానే థాణెలోని ఎటర్నిటీ మాల్‌, వండర్‌ మాల్‌, నాగ్‌పుర్‌లోని మూవీమ్యాక్స్‌ ఎటర్నిటీ అనే థియేటర్లలో లోక్ సభ ఎన్నికలను ప్రత్యేక్ష ప్రసారం చేయనున్నాయి. అలానే పుణెలోని మూవీమ్యాక్స్‌ తదితర థియేటర్లు జూన్‌ 4న ఎన్నికల ఫలితాలను పెద్ద స్క్రీన్‌పై ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే పేటీఎం వంటి వేదికల్లో బుకింగ్స్‌ను ప్రారంభించారని సమాచారం. ఉదయం 9 గంటల నుంచి ఆ థియేటర్‌లలోకి అనుమతిస్తారు. సుమారు 6గంటల పాటు థియేటర్‌లో ఎన్నికల ఫలితాలను ప్రదర్శిస్తారు.

గెలుపు పై ధీమా
టికెట్‌ ధర రూ. 99 నుంచి రూ. 300 వరకు ఉంటుంది. బిగ్‌ స్క్రీన్‌పై ఎన్నికల ఫలితాలు చూడాలని ఆశించేవారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. తాము టికెట్ బుక్ చేసుకున్నట్లు కొందరు స్క్రీన్‌షాట్లను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. ఆ ఫోటోలు ప్రస్తుతం నెటింట్లో వైరల్‌గా మారాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ అవకాశం ఉంటే బాగుంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అయితే, ఏపీలో పార్టీల ప్రధాన కార్యాలయాల్లో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తుండటంతో...ఫలితాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+