దేశంలోనే అతి పొడవైన నాన్ స్టాప్ రైలు.. ఎక్కడా ఆగదు!
దేశవ్యాప్తంగా ప్రస్తుతం రైళ్లకు మహర్దశ నడుస్తోందని చెప్పొచ్చు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ రైళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో ఎక్కడికక్కడ కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు, కొత్త రైళ్లను పట్టాలెక్కించడం, స్టేషన్లను విమానాశ్రయాల తరహాలో తీర్చిదిద్దడంలాంటి పనులతోపాటు వందేభారత్, వందే సాధారణ్ లాంటి రైళ్లను కూడా పట్టాలపైకి ఎక్కిస్తున్నారు. ప్రయాణికులు ఆహ్లాదకరమైన అనుభూతిని ఇవ్వాలనే ఉద్దేశంతో సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్ ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇవి దేశంలోని ప్రధాన నగరాల మధ్య ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో చేరుకునేలా ఉద్దేశంతో పట్టాలెక్కించారు.
వందేభారత్ కన్నా ముందుగానే పట్టాలెక్కిన రైలు
వందేభారత్ రైళ్లతో సంబంధం లేకుండా వీటికంటే ముందే పట్టాలెక్కిన ఓ సూపర్ ఫాస్ట్ రైలు ఎక్కడైతే బయలుదేరిందో అక్కడి నుంచి గమ్యస్థానానికి చేరుకోవడానికి కేవలం మూడు స్టాప్స్ ఉన్నాయి. బయలుదేరిన స్టేషన్ నుంచి ఆగకుండా ఏకంగా 493 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దేశంలో ఆగకుండా ఎక్కువ దూరం ప్రయాణించి అత్యంత పొడవైన నాన్ స్టాప్ రైలుగా ప్రసిద్ధి కెక్కింది. దానిపేరు ముంబయి సెంట్రల్ - హపా దురంతో ఎక్స్ ప్రెస్. ముంబయిలో ప్రతిరోజు రాత్రి 11.00 గంటలకు బయలుదేరే ఈ రైలు నాన్ స్టాప్ గా 493 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తెల్లవారుజామున 4.50 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. అక్కడి నుంచి మరో రెండు స్టేషన్లలో మాత్రమే ఆగి హపా వెళుతుంది.

ఎక్కడా ఆగకుండా 465 కిలోమీటర్ల ప్రయాణం
ముంబయి-హపా రైలు తర్వాత పుణె-హౌరా దురంతో ఎక్స్ ప్రెస్ కూడా ఈ జాబితాలో పేరు సంపాదించుకుంది. పుణెలో బయలుదేరి ఎక్కడా ఆగకుండా 468 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీంతోపాటు ముంబయి-న్యూఢిల్లీ-ముంబయి రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు కూడా ఎక్కడా ఆగకుండా 465 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాతే తొలి స్టాప్ ఉంది. ఇది ముంబయిలో బయలుదేరిన తర్వాత రాజస్థాన్ లోని కోటా వద్ద ఆగుతుంది. ఆ సమయంలో 465 కిలోమీటర్లు నాన్ స్టాప్ గా ప్రయాణిస్తుంది. భారతీయ రైల్వేలో ఇటువంటి రికార్డులు చాలా ఉన్నాయి. ప్రయాణికులకు అతి తక్కువ ధరల్లో భద్రతతో కూడిన ప్రయాణాన్ని కల్పిస్తూ వారిని క్షేమంగా గమ్యస్థానానికి చేర్చడంలో భారతీయ రైల్వేలు ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరును సంపాదించుకున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్ వర్క్ లో నాలుగో స్థానంలో నిలిచింది.












Click it and Unblock the Notifications