Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహిళలకు ఫ్రీఫ్రీఫ్రీ, జగన్ కు సహాయం చెయ్యడం తెలీదు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి

చిత్తూరు జిల్లాలోని పలమనేరు సమీపంలోని మొగలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 8 మంది మరణించి 33 మందికి గాయాలైనాయని, మరణించిన వారి కుటుంబాలకు రూ 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గాయపడిన వారికి రూ. లక్ష చొప్పున పరిహారం అందిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వివరించారు.

శనివారం ధర్మవరంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన తరువాత మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో రోడ్డు ప్రమాదాలు నివారించడానికి కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఆంధ్రప్రదేశ్ మొత్తం బ్లాక్ స్పాట్స్ గుర్తించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని, రోడ్డు ప్రమాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కు గుర్తింపు తీసుకొస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.

The minister said that free travel for women in RTC buses will start soon in Andhra Pradesh

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకుంటామని, ఆయన కుటుంబానికి భీమా ద్వారా సాయం అందుతుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. పనిలో పనిగా మాజీ సీఎం జగన్ ను టార్గెట్ చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తనదైన శైలిలో ఆయన మీద మరోసారి విరుచుకుపడ్డారు. జగన్ ఎలాంటి రాజకీయాలు చెయ్యడానికి సిద్దం అవుతారని, ఈసారి వరద బాధితులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చెయ్యడానికి సిద్దం అయ్యారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అయితే విజయవాడ వరద బాదితులను కూడా పట్టించుకోని జగన్ కేవలం వారితో 20 నిమిషాలు మాట్లాడి ఎప్పటిలాగే చంద్రబాబు ప్రభుత్వంపై విషం చిమ్మారని, వరద బాధితులను ఆదుకోవడానికి వైసీపీ నాయకులు ఒక్కపైసా కూడా ఇవ్వలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు.

The minister said that free travel for women in RTC buses will start soon in Andhra Pradesh

ఇలాంటి డ్రామాలు ఆడటం, బురద రాజకీయాలు చెయ్యడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు జగన్ ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు మాత్రం ఆయన్ను నమ్మరని, ఇప్పటికే జగన్ ను ఒక్కసారి నమ్మి ఆయనకు అధికారం కట్టబెట్టిన ప్రజలు నిలువునా మోసపోయారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ వరద బాధితులను సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు అందరూ ఆదుకుంటారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+