మందుబాబులకు గుడ్ న్యూస్, దిక్కుమాలిన బ్రాండ్లకు చెక్, రెండు రోజుల్లో నిర్ణయం ?

ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర్ ఒకటో తేదీ నుండి నూతన మద్యం విధానం అమలులోకి వస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం విధానం అమలులోకి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మంత్రివర్గ ఉప సంఘం మంగళవారం సమావేశం అయ్యి నూతన మద్యం విధానం అమలు చేసే విషయంలో చర్చలు జరుపుతోంది.

ఆంధ్రప్రదేశ్ లో నూతన మధ్యం విధానం అమలు చేసే విషయంపై పలువురు మంత్రులు వారి అభిప్రాయాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వివరించారని తెలిసింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం విధానం అమలు చేశారు. రోజుకొక దిక్కుమాలిన కొత్త బ్రాండ్లతో రంగు నీళ్లకు స్టికర్లు అతికించి నాసిరకం మద్యం విక్రయించి మా ఆరోగ్యంతో చెలగాటం ఆడారని మందుబాబులు ఆరోపించారు.

The ministerial sub-committee is negotiating with Chandrababu Babu on the new liquor policy

నాసిరకం మద్యం తాగడం వలన ఆ మద్యంకు బానిస అయిన వాళ్ళ ఆరోగ్యం నాశనమైందని ఆ మందుబాబుల కుటుంబ సభ్యులు పెద్దఎత్తున ఆరోపించారు. పనికిమాలిన లిక్కర్ బ్రాండ్లు విక్రయించిన వైసీపీ ప్రభుత్వం భారీ మొత్తంలో డబ్బులు సంపాదించిందని ఆరోపణలు కూడా ఉన్నాయి. బ్రాండెడ్ మద్యం విక్రయించి అతక ధరలు పెట్టిఉంటే ఎలాంటి ఇబ్బంది లేదని, అయితే అదే అధిక ధరలు వసూలు చేసి నాసిరకం మద్యం విక్రయించారని మందుబాబులు ఆరోపించారు.

దిక్కుమాలిన బ్రాండ్ల మద్యం మాతో తాగించిన వైసీపీ ప్రభుత్వం మా జీవితాలతో చెలగాటం ఆడిందని మందుబాబులు ఆరోపించారు. జగన్ ప్రభుత్వం పడిపోవడానికి ఈ పనికిమాలిన లిక్కర్ బ్రాండ్లు తాగిన మందుబాబులే ప్రధాన కారణమని ఆ తర్వాత వైసీపీకి చెందిన కొందరు నాయకులు అంగీకరించారు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిక్కుమాలిన మద్యం విధానానికి స్వస్తి చెప్పి ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం విధానం అమలులోకి తీసుకురావాలని చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది.

The ministerial sub-committee is negotiating with Chandrababu Babu on the new liquor policy

ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో లిక్కర్ విక్రయాలు, నూతన మద్యం విధానం అమలు చేసే విషయంలో ఎక్సైజ్ శాఖ అధికారులు, కూటమి ప్రభుత్వంలోని నాయకులు ఓ నివేదిక తయారు చేశారని సమాచారం . మంగళవారం చంద్రబాబు నాయుడుతో సమావేశమైన మంత్రివర్గ ఉప సంఘం వారి అభిప్రాయాల్ని సీఎంకు చెప్పారని, ఈ విషయంపై పలుకోణాల్లో చర్చలు కూడా జరిగాయని తెలిసింది.

అక్టోబర్ 1వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ లో నూతన మధ్యం విధానం అమల్లోకి రానుండటంతో ఈ విషయంపై గురువారం లోపు ఓ నిర్ణయం తీసుకుని తరువాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో దిక్కుమాలిన మద్యం విక్రయాలకు త్వరలోనే చేక్ పడుతోందని మందుబాబులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంతకాలం తాగిన దిక్కుమాలిన లిక్కర్ బ్రాండ్లు ఇక ముందు మా కంటికి కనపడవని మందుబాబులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+