Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలుగు రాష్ట్రాల్లో రుతువపనాల విస్తరణపై కీలక అప్ డేట్ - ఎండలు, వర్షాలు..!!

ఏపీలో రుతుపవనాలు ప్రవేశించాయి. అయినా ఎండలు తగ్గలేదు. శ్రీహరికోట..పుట్టపర్తి వరకు విస్తరించిన నైరుతి రుతుపవనాలు అక్కడ నుంచి ముందుకు కదలటం లేదు. దీంతో ఎండలు..వడగాల్పులతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతోంది. అక్కడక్కడా వర్షాలు కురిసినా రుతుపవనాలు విస్తరించకపోవటంతో వేడి వాతావరణం కొనసాగుతోంది. అరేబియా సముద్రంలో ఉన్న అతి తీవ్ర తుఫాను ఈ రోజు సాయంత్రం తీరం దాటనుంది. తెలంగాణలోనూ భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

తుఫాను బలహీనపడిన తరువాత ఈ నెల 17వ ేదీ తరువాత ఏపీలోని ఇతర ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీలో ఈ నెల 17 వరకు వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. బుధవారం రాష్ట్రంలోని 137 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..203 మండలాల్లో వడగాల్పులు వీచాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అనకాపల్లి జిల్లా మాడుగులలో 45.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రలు నమోదయ్యాయి.

The monsoons flow has weakened due to Biporjoy cyclone in Arabian sea as IMA Reports

రాష్ట్రంలో మరో మూడు రోజులు ఎండ తీవ్రతతో కడిన వడగాల్పులు ప్రభావం చూపుతాయని విపత్తలు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అనేక మండలాల్లో 40-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఈ రోజు (గురువారం) 252 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..232 మండలాల్లో గాడ్పులు..శుక్రవారం 268 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..226 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. అటు తెలంగాణలోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. రాగల మూడు రోజులు ఎండలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

ఇదే సమయంలో మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలకు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అదే సమయంలో ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ, మెదక్‌ జిల్లాల్లో అక్కడక్కడ వడగాలు వీస్తాయని పేర్కొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+