అరకులో కొనుగోలు, ఢిల్లీలో డీలింగ్, ఇంతకు ఏం వ్యాపారమో తెలుసా ?, మైండ్ బ్లాక్ !

ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి రవాణా అవుతోందని మరోసారి వెలుగు చూసింది. గత ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి గుట్టుచప్పుడు కాకుండా గంజయి తరలిస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఒకే ఊరిలో వేర్వేరు ప్రాంతాల్లో అద్దె ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్న గంజాయి స్మగ్లర్లు ఆంధ్రప్రదేశ్ లో గంజాయి కొనుగోలు చేసి ఢిల్లీకి తరలిస్తున్నారని పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది.

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ గంజాయి స్మగ్లర్ల వివరాలు వెళ్లడించారు. ఉత్తరప్రదేశ్, డిల్లీకి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. అరకులోకి విశ్వనాథపురంలో ఉత్తరప్రదేశ్ లోని మేరఠ్ కు చెందిన మహమ్మద్ వసీం గంజాయి కొనుగోలు చేస్తున్నాడని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ చెప్పారు.

The police arrested a gang that was supplying ganja to Delhi from Vijayaganaram

ఢిల్లీకి చెందిన కబీర్ అనే నిందితుడు అదే ఢిల్లీలో గంజాయి వ్యాపారలావాదేవీలు నిర్వహిస్తున్నాడని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. ముగ్గురు నిందితులు ఎవ్వరికీ అనుమానం రాకుండా, అందరూ ఒకే చోట ఉండకుండా విజయనగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో నకిలి పేర్లతో ఇండ్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారని, తాము వ్యాపారం చేస్తున్నామని స్థానికులను నమ్మించారని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.

ఇలా నిందితులు పోలీసులకు చిక్కకుండా, పోలీసులకు కూడా అనుమానం రాకుండా రహస్య ప్రాంతంలో అప్పుడప్పుడు భేటీ అవుతున్నారని, గుట్టుచప్పుడు కాకుండా ఢిల్లీకి గంజాయి సరఫరా చేస్తున్నారని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. గత ఏడాది కాలం నుంచి విజయనగరం నుంచి ఢిల్లీకి గంజాయి తరలిస్తున్నారని, ఈ కేసులో మొత్తం ఐదు మంది ప్రమేయం ఉందని, నిందితులను అరెస్టు చెయ్యడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మీడియాకు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలోనే విజయనగరం నుంచి దేశరాజధాని ఢిల్లీకి గంజాయి సరఫరా అవుతోందని వెలుగు చూడటంతో విజయనగరం ప్రజలు ఉలిక్కిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+