Purnananda: పూర్ణానంద స్వామిజీ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు..
కొంత మంది కామాంధులు భక్తి పేరుతో ఆశ్రమాలు పెట్టి.. స్వామిజీల ఆవతారమెత్తి మహిళలు, బాలికలపై లైగింక వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే జరిగాయి. తాజాగా ఏపీలోని విశాఖపట్నం జిల్లా వెంకోజిపాలెంలోని జ్ఞనానంద ఆశ్రమ నిర్వహుకుడు పూర్ణానంద స్వామిజీ కామకాలాపాలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అతని కీచక చర్యలు వింటే మనం షాక్ అవ్వాల్సిందే.
పూర్ణానంద రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. రిమాండ్ రిపోర్టులో దిశ పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. పూర్ణానంద అర్ధరాత్రి బాలికలను నిద్ర లేపేవాడని.. వారిని గదిలోకి తీసుకెళ్లు అత్యాచారం చేసేవాడని పోలీసులు పేర్కొన్నారు. అతను ఏడాదిగా ఇద్దరు బాలికలపై అత్యాచారం చేశాడన తెలిపారు. అందులో ఓ బాలిక గర్భం కూడా దాల్చినట్లు చెప్పారు.

పూర్ణానంద ఇద్దరు బాలికలను అత్యాచారం చేసినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయని వివరించారు. బాలికలకు గర్భం రాకుండా ఉండేందుకు వారికి ట్యాబ్లెట్లు కూడా ఇచ్చేవాడని తెలిపారు. ఆ శ్రమంలో మొత్తం 3 బాలికలు, 9 మంది బాలురు ఉండేవారు. అయితే అందులో ఓ అమ్మాయి గర్భం దాల్చడంతో ఆమెను బంధువులు తీసుకెళ్లి పోయారని చెప్పారు.
ఓ బాలిక ఆశ్రమం నుంచి తప్పించుకుని రావడంతో పూర్ణానంద స్వామి బాగోతం బయటకు వచ్చింది. ఆ బాలికపై పూర్ణానంద్ అత్యాచారానికి పాల్పడ్డడు. ఆ బాలికను గదిలోనే ఉంచి.. అత్యాచారం చేసేవాడు. ఆ బాలిక పనిమనిషి సాయంతో ఆశ్రమం నుంచి తప్పించుకుని ఓ రైలు ఎక్కంది. రైలు ప్రయాణిస్తున్న ఓ మహిళకు జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో ఆ మహిళ బాలికతో పాటు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్ణానందను అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications