ఎన్డీఏను డిమాండ్ చేసే స్థితిలో లేం: తేల్చేసిన టీడీపీ
Chandrababu Naidu: దేశ రాజధానిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తోన్న ఇండియా కూటమి వరుస భేటీలను నిర్వహిస్తోన్నాయి. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి.
కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 272. దీనికి 20 సీట్లు మాత్రమే అధికంగా సాధించగలిగింది ఎన్డీఏ సంకీర్ణ కూటమి. 292 సీట్లకు పరిమితం అయింది. సొంతంగా మెజారిటీని సైతం తెచ్చుకోలేకపోయింది బీజేపీ. ఆ పార్టీకి దక్కింది 240 స్థానాలే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే భాగస్వామ్య పక్షాల మద్దతు అత్యవసరం.

అటు ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి 234 స్థానాలు లభించాయి. ఇతరులు 17 చోట్ల గెలిచారు. అయినప్పటికీ- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్‌ను ప్రస్తుతానికి అందుకోలేకపోయిందీ ఇండియా అలయెన్స్. దీనితో తటస్థ పార్టీల మద్దతును కూడగట్టుకోవడానికి తనవంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది. మేజిక్ ఫిగర్‌ను అందుకోవడానికి ఏ చిన్న అవకాశాన్నీ వదలుకోదలచుకోలేదు కాంగ్రెస్.
ఈ పరిణామాల మధ్య ఎన్డీఏ.. ఢిల్లీలో సమావేశం కానుంది. బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అధినేతలు, కొత్తగా ఎన్నికైన లోక్‌సభ అభ్యర్థులు ఇందులో పాల్గొననున్నారు. తమ పార్లమెంటరీ పార్టీ అధినేతగా ప్రధానమంత్రిని ఎన్నుకోనున్నారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ మాట్లాడారు. ఏపీలో ముస్లిం రిజర్వేషన్లు కొనసాగింపుపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారాయన. తాము ముస్లిం రిజర్వేషన్లను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అస్సలు సమస్య లేదని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఎన్డీఏతో తాము ఎలాంటి డిమాండ్లపై చర్చించట్లేదని, దానికి ఇది సరైన వేదిక కాదని అన్నారు. తాము ఎన్డీఏలో భాగస్వామ్యం అయినందున డిమాండ్ చేయాలనే ప్రశ్నే తలెత్తదని కనకమేడల తేల్చి చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం వంటి హామీలను పరిష్కరించుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీ 25 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని, రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన బాధ్యత తమపై ఉందని కనకమేడల అన్నారు. దీనికే తమ తొలి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. జూన్ 9వ తేదీన ప్రధానిగా నరేంద్ర మోదీ ఒక్కరే ప్రమాణస్వీకారం చేస్తారని, ఆ తరువాతే మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని వ్యాఖ్యానించారు.
-
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
చంద్రబాబుకు జాతీయ పార్టీ నేత సవాల్: మణిపూర్ లా తయారవుతాయి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications