వ్యూహంలో చంద్రబాబుకు, జగన్ కు అదే తేడా..?

తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కొడాలి నాని, వల్లభనేని వంశీకి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇచ్చారు.

రాజకీయం అన్న తర్వాత నమ్మకం మీద ఆధారపడివుంటుంది. నమ్మకం అనేది అత్యంత ముఖ్యమైన అంశంగా రాజకీయాల్లో పరిగణిస్తారు. అయితే ఎంతవరకు ఈ నమ్మకం ఉండాలి? దీనికి కూడా ఒక పరిమితి ఉంటుందా? అంటే సమాధానం కష్టమవుతుంది. రాజకీయాల్లో ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి అంటారు. పరిమితులు దాటి నాయకులకు అధికారం కట్టబెడితే తర్వాత ఇబ్బంది పడేది కూడా పార్టీయే అవుతుంది.

 మితిమీరిన స్వేచ్ఛ పార్టీనే దాటింది

మితిమీరిన స్వేచ్ఛ పార్టీనే దాటింది


తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కొడాలి నాని, వల్లభనేని వంశీకి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో గుడివాడలో పార్టీని పటిష్టం చేయడంతోపాటు కొడాలి నాని కూడా అభివృద్ధి చెందారు. గుడివాడ అంటే కొడాలి నాని.. కొడాలి నాని అంటే గుడివాడ అన్నట్లుగా ఇప్పుడు మారిపోయింది. నిత్యం చంద్రబాబుపై విరుచుకుపడుతుండే స్థాయికి వచ్చిన కొడాలి నాని.. అలా అవడానికి కారణం కూడా చంద్రబాబే అంటే అతిశయోక్తి కాదు.

ఇతర నేతలకు, జగన్ కు అదే తేడా

ఇతర నేతలకు, జగన్ కు అదే తేడా


గన్నవరం అంటే వల్లభనేని వంశీ.. వల్లభనేని వంశీ అంటే గన్నవరం అన్నట్లుగా అక్కడి పరిస్థితి మారిపోయింది. వారి ఇష్టానికి వదిలేయడంవల్ల పార్టీని అభివృద్ధి చేయడంతోపాటు తాను కూడా అభివృద్ధి చెందారు. ప్రస్తుతం గన్నవరం అంటే టీడీపీ అనేదిపోయి వంశీ అనే పేరు వచ్చింది. ఇదే తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఈ తరహా స్వేచ్ఛ వల్ల నియోజకవర్గాల్లో పార్టీకన్నా నాయకులే బలోపేతమయ్యారు.. బలం పుంజుకున్నారు. ఇటువంటివాటిని దృష్టిలో ఉంచుకున్న ముఖ్యమంత్రి జగన్ తన పార్టీ నేతలను ఎవరిని ఎక్కడ ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుతున్నారు. మిగతా నేతలకు, జగన్ కు ఈ విషయంలో స్పష్టమైన తేడా కనపడుతోంది.

నాయకులుగా ఎదిగి.. పార్టీకి చేటు

నాయకులుగా ఎదిగి.. పార్టీకి చేటు


నాయకులుగా ఎదిగిన తర్వాత పార్టీకి చేటు తెస్తున్నారు. దీనివల్ల పార్టీని మించి ఎదిగిపోయారు. నియోజకవర్గాల్లో నేతలే పార్టీని శాసించే స్థితి వచ్చింది. దీన్ని ముందుగానే గ్రహించిన వైఎస్ జగన్ నియోజకవర్గాల్లోనైనా, రాష్ట్రంలోనైనా నాయకులకు, నేతలకు ఎంతవరకు స్వేచ్ఛ ఇవ్వాలో అంతవరకే ఇస్తున్నారు. ఎవరి పరిమితుల్లో వారిని ఉంచుతున్నారు. వైసీపీని చూసి ఓటేయాలికానీ, నాయకులను చూసి ఓటేసే పద్ధతి రాకూడదు అనేది ఒక్కటే జగన్ లక్ష్యం. అందుకే ముఖ్యమంత్రి ఒక వ్యూహం ప్రకారం తన పార్టీలో బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడైనా పార్టీ వినపడుతుందికానీ నాయకుల మాట వినపడదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+