Bay of Pigs: క్యూబాలో అమెరికా ఎలా ఓడిపోయి లొంగిపోయింది ? నెక్ట్స్ ఇరానేనా ?

ఇరాన్ (iran)పై ఇజ్రాయెల్ తో కలిసి అమెరికా యుద్దం ప్రారంభించి నెల రోజులు కావస్తోంది. సుప్రీం లీడర్ ను హతమార్చేశాక ఇరాన్ లొంగిపోతుందని ఇరు దేశాలూ వేసుకున్న లెక్కలు తప్పాయి. ఇప్పుడు యుద్దం నుంచి ఎలా బయటపడాలో తెలియక అమెరికా-ఇజ్రాయెల్ విలవిల్లాడుతున్నాయి. పరువు కాపాడుకునేందుకు దాడులు కొనసాగిస్తూ, మరోవైపు చర్చలు జరుగుతున్నట్లు చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నాయి. చివరికి భూతల దాడులకు అమెరికా సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో గతంలో ఇలాంటి పరిస్ధితులే ఎదుర్కొని క్యూబా (cuba)లో అమెరికా ఎలా 72 గంటల్లో ఓడిపోయి లొంగిపోయిందో ఓసారి చూద్దాం..

సైనిక శక్తి ఎప్పుడూ విజయానికి ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వదని చరిత్రలో ఎన్నోసార్లు రుజువైంది. ముఖ్యంగా ఒక దేశ సంకల్పాన్ని నాయకులు తప్పుగా అంచనా వేసినప్పుడు ఇలా జరిగింది. 1961లో క్యూబాలో సోవియట్ యూనియన్ మద్దతు ఉన్న విప్లవకారుడు ఫిడేల్ క్యాస్ట్రో ప్రభుత్వాన్ని కూలదోసి, తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అమెరికా ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే నేరుగా అమెరికా క్యూబాతో యుద్ద చేయకూడదు. ఇందుకోసం అమెరికా అధ్యక్షుడు ఐసన్ హోవర్ రెండు మార్గాలు ఎంచుకున్నారు. మొదటిది కాస్ట్రో విమానాలను ధ్వంసం చేయడానికి క్యూబా విమానాశ్రయాలపై బాంబు దాడులు చేయడం, రెండవది అమెరికాలో క్యూబా ప్రవాసుల్ని తమ దేశానికి పంపి అక్కడ ఒక బీచ్‌లో దించి, తద్వారా క్యూబా లోపల పెద్ద తిరుగుబాటును రేకెత్తించడం.

The Shadow of the Bay of Pigs What History Teaches About US Engagement with Iran

ఆ తర్వాత అమెరికాలో ఐసన్ హోవర్ స్ధానంలో జాన్ ఎఫ్ కెన్నడీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయినా క్యూబా ఆపరేషన్ యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 1961 ఏప్రిల్ 15న అమెరికా శిక్షణ పొందిన క్యూబా ప్రవాసులు నడిపిన ఎనిమిది B-26 బాంబర్లు మూడు క్యూబా విమానాశ్రయాలపై దాడి చేశాయి. ఈ బాంబర్లకు అమెరికా గుర్తులు లేవు, బీ-26 లకు క్యూబా జాతీయ చిహ్నాలతో సహా తప్పుడు క్యూబా వైమానిక దళపు మార్కింగ్‌లు, నకిలీ సీరియల్ నంబర్లు వేశారు. ఈ దాడుల్ని క్యూబా ఎయిర్ ఫోర్స్ పైలట్లు లేదా అంతర్గత క్యూబా దళాలు చేసినట్లు చూపించేందుకే ఇలా చేశారు. ఈ బాంబులు కొన్ని విమానాల్ని దెబ్బతీశాయి కానీ చాలా వరకు లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. మరుసటి రోజు అమెరికా ప్రమేయం ప్రపంచానికి తెలిసిపోతుందని ఆందోళన చెందిన కెన్నడీ రెండవ బాంబు దాడిని రద్దు చేశారు.

ఏప్రిల్ 17న క్యూబాలో భూతల దాడుల్ని ప్రారంభించారు. బ్రిగేడ్ 2506 క్యూబా దక్షిణ తీరంలో బే ఆఫ్ పిగ్స్‌లోని (bay of pigs) ప్లాయా గిరాన్ అనే ప్రదేశంలో దిగింది. ఆ ప్రదేశం చిత్తడి నేలగా ఉండి, పెద్ద నగరాలకు దూరంగా ఉంది. ఐదు నౌకలు సైనికులను, ట్యాంకులను, సామాగ్రిని మోసుకెళ్లాయి. పారాట్రూపర్లు విమానాల నుండి దూకారు. మొదట, ప్రవాసులు స్థానిక మిలీషియాను వెనక్కి నెట్టగలిగారు. వారు బీచ్‌ను ఆక్రమించి కొన్ని మైళ్లు లోపలికి వెళ్లారు. కానీ కాస్ట్రో వేగంగా స్పందించాడు. బ్రిగేడ్ 2506లోని తన గూఢచారుల ద్వారా, రేడియో సిగ్నల్స్ ద్వారా అతనికి ప్లాన్ తెలిసిపోయింది. బే ఆఫ్ పిగ్స్ కాస్ట్రోకు అత్యంత ఇష్టమైన ప్రదేశాలలో ఒకటి. అతనికి ఆ చోటు బాగా తెలుసు. దీంతో ట్యాంకులు, విమానాలు, వేలాది సైనికుల్ని దింపాడు.

క్యూబా ఎయిర్ ఫోర్స్ ట్యాంకుల్ని ప్రవాసులను అడ్డుకోవడానికి ముందే మోహరించారు. క్యూబా పైలట్లు పాత విమానాలను నడిపినప్పటికీ అనేక ప్రవాసుల బాంబర్‌లను కూల్చివేశారు. దండయాత్ర చేసిన వారికి త్వరగా మందుగుండు సామగ్రి అయిపోయింది. క్యూబా వైమానిక దళపు దాడుల కారణంగా వారి సరఫరా నౌకలు చాలా దూరంగా ఉండాల్సి వచ్చింది. క్యూబా దళాలు ప్రవాసులకు మద్దతు ఇస్తున్న ఒక నౌకను కూడా ముంచేశాయి. బీచ్ నుండి రేడియో సందేశాలు అమెరికా సహాయం కోసం వేడుకున్నాయి. కానీ కెన్నడీ మరిన్ని వైమానిక దాడులను నిరాకరించారు, ఎందుకంటే ఇది అమెరికా, క్యూబా మధ్య బహిరంగ యుద్ధానికి దారి తీసేది. పోరాటం కేవలం మూడు రోజులు మాత్రమే కొనసాగింది. ఏప్రిల్ 19 నాటికి, ప్రవాసులు అన్ని వైపుల నుండి చిక్కుకుపోయారు. వంద మందికి పైగా సైనికులు బీచ్‌లోనే మరణించారు. వారిలో చాలా మంది లొంగిపోయారు. కాస్ట్రో దళాలు 1,100 మందికి పైగా ఖైదీలను పట్టుకున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 114 మంది దండయాత్ర చేసిన వారు మరణించారు, నలుగురు అమెరికా పైలట్లు B-26లను నడుపుతూ మరణించారు.

The Shadow of the Bay of Pigs What History Teaches About US Engagement with Iran

బే ఆఫ్ పిగ్స్ దండయాత్ర అనేక కారణాల వల్ల విఫలమైంది. మొదటి తప్పు ఫేక్ నిఘా సమాచారం. క్యూబా ప్రజలు కాస్ట్రోకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారని సీఐఏ కెన్నడీకి చెప్పింది. ఇది జరగలేదు. ఎందుకంటే చాలా మంది క్యూబన్లు విప్లవానికి మద్దతు ఇచ్చారు. క్యూబన్లు కాస్ట్రోను పేద రైతులకు భూములిచ్చి, పాత నియంతను తరిమేసిన నాయకుడిగా చూశారు. అలాగే తమ ప్రవాసులు విదేశీ ఆయుధాలతో తిరిగి వస్తున్న ధనవంతుల్లా క్యూబన్లకు కనిపించారు. రెండవది సైన్యానికి ఎలాంటి వాయు సహాయం అందించలేదు. కాస్ట్రో వైమానిక దళాన్ని పూర్తిగా నాశనం చేయడానికి ప్రణాళికకు అమెరికా విమానాలు అవసరం. కెన్నడీ రెండవ దాడిని రద్దు చేసినప్పుడు, ఈ దండయాత్ర చేసిన వారు తమ రక్షణను కోల్పోయారు. బుల్లెట్లు లేదా ఆహారం లేకుండా, బ్రిగేడ్ మరింత పోరాడలేక, దాదాపు 72 గంటల్లో కూలిపోయింది. మూడవది రహదారులు లేని, దట్టమైన చిత్తడి నేలలు విస్తరించి ఉన్న బే ఆఫ్ పిగ్స్‌. ఇందులో సైనికులు వేగంగా ముందుకు కదలలేకపోయారు. ఈ ఓటమి అమెరికాకు తీవ్ర అవమానకరమైనప్పటికీ, ట్రంప్‌కు భిన్నంగా, కెన్నడీ ఈ వైఫల్యానికి బహిరంగంగా బాధ్యత వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+