Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమెరికా-ఇరాన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్: రంగంలోకి హిజ్బుల్లా..!

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ముదురుతున్న యుద్ధ వాతావరణం మధ్యప్రాచ్య దేశాలను వణికిస్తోంది. ఈ ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరిన తరుణంలో హిజ్బుల్లా చీఫ్ షేక్ నయీమ్ ఖాసిం చేసిన హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తమ లెబనీస్ ఉద్యమం శత్రువుల ముందు మోకరిల్లదని.. మడమ తిప్పకుండా పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. యుద్ధం ఎంత భీకరంగా ఉన్నా.. తమ లక్ష్యం నుంచి వెనక్కి తగ్గబోమని.. అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమే కానీ లొంగిపోయే ప్రసక్తే లేదని హిజ్బుల్లా చీఫ్ నయీమ్ ఖాసిం ప్రకటించారు.

గౌరవం, మనుగడ కోసం పోరాటం
బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో నయీమ్ ఖాసిం లెబనాన్ ప్రస్తుత పరిస్థితిని విశ్లేషించారు. లెబనాన్ ఇప్పుడు ఓ చారిత్రాత్మక మలుపులో నిలబడి ఉందని.. దేశం ముందు ఇప్పుడు రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మొదటిది భూమిని, ఆత్మగౌరవాన్ని, రాబోయే తరాల భవిష్యత్తును శత్రువుకు ధారపోసి బానిసలుగా లొంగిపోవడం.. రెండోది కష్టనష్టాలకు ఓర్చి శత్రువును వీరోచితంగా ఎదుర్కోవడమని ఆయన స్పష్టం చేశారు. తాము రెండో మార్గాన్నే ఎంచుకున్నామని.. గౌరవం లేని జీవితం కంటే పోరాటమే మిన్న అని ఆయన అన్నారు. ఈ యుద్దం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాదని.. ఇది తమ ఉనికి, ప్రాంతీయ సమగ్రతకు సంబంధించిన మనుగడ పోరాటమని ఆయన అభివర్ణించారు.

Hezbollah Chief Sheikh Naim Qassem Warns US and Israel No Surrender Amid Iran War Tensions

ఇజ్రాయెల్ ఎత్తుగడలను చిత్తు చేస్తాం..
ఇజ్రాయెల్, దాని మిత్రదేశాల వ్యూహాలను హిజ్బుల్లా దళాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయని నయీమ్ ఖాసిం తెలిపారు. తమ పోరాట పటిమ కారణంగానే ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుల్లో భారీ అడుగు వేయలేకపోయిందని ఆయన గుర్తు చేశారు. తమ సైనికులు ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలు, దేశభక్తి దేశానికే గర్వకారణమని ఆయన కొనియాడారు. కేవలం యుద్ధ వీరులనే కాకుండా.. ఈ దాడుల వల్ల ఇళ్లు కోల్పోయి రోడ్డున పడినా.. దేశం కోసం దృఢంగా నిలబడుతున్న సాధారణ ప్రజల సహనాన్ని, త్యాగాన్ని కూడా హిజ్బుల్లా చీప్ ప్రత్యేకంగా అభినందించారు.

శాంతి చర్చల మధ్యే పెరుగుతున్న ఉద్రిక్తతలు
మరోవైపు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య తెరవెనుక శాంతి ఒప్పందాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్, నెతన్యాహు ద్వయం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు మంటలకు ఆజ్యం పోస్తున్నాయి. హిజ్బుల్లా వంటి సాయుధ సంస్థలు చేస్తున్న ఇటువంటి ప్రకటనలు శాంతి ప్రయత్నాలకు ప్రతిబంధకంగా మారుతున్నాయి. హిజ్బుల్లా చీఫ్ నయీం ఖాసి చేసిన కామెంట్ల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో పూర్తిస్థాయి యుద్ధం మొదలవుతుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+