IND vs SL: గాలే టెస్టులో జైస్వాల్ రనౌట్ వివాదం! (వీడియో)
IND vs SL: భారత, శ్రీలంక జట్ల మధ్య గాలే వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ రనౌట్ అయిన తీరు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం సాధారణ రనౌట్ మాత్రమే కాకుండా.. శ్రీలంక బౌలర్‌తో ఢీకొనడం, బ్యాటర్ల మధ్య అపార్థం, శ్రీలంక జట్టు అప్పీల్ చేసిన తీరుపై క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతోంది.
బ్యాటర్‌ను ఢీకొన్న బౌలర్.. క్రీజులో అయోమయం
టీమిండియా ఇన్నింగ్స్ 11వ ఓవర్లో ఈ నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. శ్రీలంక బౌలర్ కేసర నువంత వేసిన చివరి బంతిని నాన్-స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ మిడ్-ఆన్ వైపు డ్రైవ్ చేసి సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే బంతిని ఆపే క్రమంలో కేసర నువంత కుడివైపుకు డైవ్ చేయగా.. నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్‌ను బలంగా ఢీకొట్టాడు. ఆ ధాటికి యశస్వి జైస్వాల్ అదుపుతప్పి కింద పడిపోయాడు. జైస్వాల్ కింద పడటం చూసి కేఎల్ రాహుల్ మధ్యలోనే ఆగిపోయాడు. తిరిగి జైస్వాల్ లేచి పరుగు పూర్తి చేయవచ్చని కేఎల్ రాహుల్ భావించి ముందుకు వచ్చాడు. అయితే యశస్వి జైస్వాల్ వెంటనే తన క్రీజ్ వైపు వెనక్కి పరుగెత్తడంతో ఇద్దరు బ్యాటర్లు ఒకే ఎండ్ కు చేరుకున్నారు. అంతకంటే ముందే కేఎల్ రాహుల్ క్రీజులోకి చేరుకోవడంతో యశస్వి జైస్వాల్ వెనుకబడిపోయాడు.

శ్రీలంక క్రీడాస్ఫూర్తిపై తలెత్తిన ప్రశ్నలు
ఫీల్డర్ ప్రభాత్ జయసూర్య బంతిని వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లాకు విసిరాడు. డిక్వెల్లా వెంటనే బెయిల్స్ ను తీసేయకుండా.. కెప్టెన్ ధనంజయ డి సిల్వా వైపు చూసి బెయిల్స్ పడగొట్టాలా అని సైగ చేశాడు. కెప్టెన్ ఆమోదం తెలపడంతో డిక్వెల్లా వికెట్లను పడగొట్టాడు. అనంతరం అంపైర్లు శ్రీలంక జట్టు తమ అప్పీల్ ను వెనక్కి తీసుకుంటారేమోనని చూశారు. కానీ శ్రీలంక అప్పీల్‌కే కట్టుబడటంతో 32 పరుగుల వద్ద ఉన్న యశస్వీ జైస్వాల్ ను థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించారు. బౌలర్ ఢీకొట్టడం వల్లే ఈ అపార్థం మొదలైంది కాబట్టి శ్రీలంక అప్పీల్ ను వెనక్కి తీసుకుంటే బాగుండేదని.. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని కొందరు విమర్శిస్తుండగా.. నిబంధనల ప్రకారం శ్రీలంక చేసింది సరైనదేనని మరికొందరు నిపుణులు సమర్థిస్తున్నారు.
Yashasvi Jaiswal was looking so good and his timing today was brilliant, but this unfortunate run-out spoiled the day for him
— Ajay Jadeja (@AjayJadeja171) August 15, 2026
He scored 32 at a strike rate of 88, but this run out....... #INDvsSL pic.twitter.com/lUtlbsBXpZ














Click it and Unblock the Notifications