సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పై దీపావళి వేళ కీలక అప్డేట్!

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పై పండుగ వేళ లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ప్రయాణికులకు ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన అధునాతన వసతులు కల్పించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు ఇప్పటికే 71 శాతం మేర పూర్తయ్యాయని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

సుమారు రూ.714.73 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ బృహత్తర ప్రాజెక్టు ద్వారా స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఈ ఆధునికీకరణ ప్రాజెక్టులో భాగంగా స్టేషన్‌కు ముందు వైపు ఉత్తర దిశలో , వెనుక వైపు దక్షిణ దిశలో భారీ హంగులతో సరికొత్త భవనాలను నిర్మిస్తున్నారు. దీనివల్ల ప్రయాణికుల రద్దీని సులభంగా నియంత్రించవచ్చు.

Secunderabad Railway Station Modernization Works 71 Completed union minister kishan reddy said good news

ఇప్పటికే రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ భవనం, కాజీపేట వైపు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి, దక్షిణం వైపు స్టేషన్‌ భవనం గ్రౌండ్‌ ఫ్లోర్, ప్రయాణికుల రాకపోకల ప్రత్యేక ప్రాంతాలు, దక్షిణ బేస్‌మెంట్ మరియు ఎలక్ట్రికల్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం నార్త్ మల్టీలెవల్‌ కార్‌ పార్కింగ్, ఎయిర్‌ కాన్‌కోర్స్, హైదరాబాద్‌ వైపు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి, కవర్‌ ఓవర్‌ ప్లాట్‌ఫాంలు, ట్రావెలేటర్లతో కూడిన ఎఫ్‌ఓబీలు, ప్లాట్‌ఫాం ఫ్లోరింగ్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ప్రస్తుతం ఈ స్టేషన్ మీదుగా రోజూ సుమారు 180 రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా, నిత్యం లక్షన్నర మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు ప్రత్యేక స్కైవాక్‌ను నిర్మిస్తున్నారు. ఈ స్కైవాక్ ద్వారా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా మెట్రో రైలు స్టేషన్‌ను చేరుకునేలా ఆధునిక అనుసంధానతను కల్పిస్తున్నారు.

దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రంగా ఉన్న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు సుమారు 150 ఏళ్లకు పైగా గొప్ప చరిత్ర ఉంది. నిజాం నవాబుల కాలంలో 1874వ సంవత్సరంలో నిజాం స్టేట్‌ రైల్వే ఆధ్వర్యంలో ఈ స్టేషన్‌ను ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు ప్రయాణికుల రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ స్టేషన్‌ను, పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రయాణికులకు అత్యంత అడ్వాన్స్డ్ సౌకర్యాలను కల్పించనుంది.

హైదరాబాదీలకు శుభవార్త.. త్వరలో వర్క్ ఫ్రమ్ పార్క్.. ల్యాప్ టాప్ బ్యాగులతో రెడీ అయిపోండి!
హైదరాబాదీలకు శుభవార్త.. త్వరలో వర్క్ ఫ్రమ్ పార్క్.. ల్యాప్ టాప్ బ్యాగులతో రెడీ అయిపోండి!

విమానాశ్రయాన్ని తలపించేలా సౌకర్యాలను అందించాలనే ఉద్దేశంతో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం దీనిని పూర్తిగా అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికి 71% పనులు పూర్తయ్యాయని, మిగతా పనులు త్వరలోనే పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుభవార్త చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+