హైదరాబాదీలకు శుభవార్త.. త్వరలో వర్క్ ఫ్రమ్ పార్క్.. ల్యాప్ టాప్ బ్యాగులతో రెడీ అయిపోండి!

ఇంట్లో లేదా ఆఫీసులో కూర్చొని పనిచేయడం బోర్ కొడుతోందా.. ఆరోగ్యం మీద ప్రభావం పడుతోందా?. ఇకపై చెట్ల నీడలో, పచ్చని వాతావరణంలో ల్యాప్‌టాప్ తెరిచి పనిచేసే అవకాశం సైబరాబాద్ వాసులకు రాబోతోంది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంపిక చేసిన ప్రజా పార్కుల్లో 'వర్క్ ఫ్రమ్ పార్క్' సదుపాయాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన తెలిపిన వివరాల ప్రకారం, ముందుగా 30 పార్కులలో వైఫై సౌకర్యంతో ఈ ప్రత్యేక స్థలాలను అందుబాటులోకి తెస్తారు. ఫ్రీలాన్సర్లు, స్టార్టప్ ఉద్యోగులు, ఇంటి నుంచి పనిచేసేవారు, విద్యార్థులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. కూర్చునే ఏర్పాట్లు, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు ఉంటే పని ఒత్తిడి మధ్యలో కాస్త స్వచ్ఛమైన గాలి పీల్చుకునే వీలు కలుగుతుంది.

Work from Park Cyberabad Parks to Turn into Work from Park Hubs Wi-Fi Zones Planned in 30 Locations

ఇది ఒక్క పథకంతో ఆగడం లేదు. కొత్త సంవత్సరం నాటికి 300 కొత్త పార్కులను అభివృద్ధి చేయాలని, ఇప్పటికే ఉన్న 97 పార్కులను 2027 ఫిబ్రవరి నాటికి పునరుద్ధరించాలని కార్పొరేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. కొంపల్లి సర్కిల్ పరిధిలోని సెంట్రల్ పార్క్ కాలనీ పార్కు వంటి చోట్ల అభివృద్ధి పనులను పరిశీలించిన కమిషనర్, సందర్శకులకు తగినన్ని కూర్చునే బెంచీలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పనుల్లో నాణ్యత పాటించాలని, గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఇలాంటి ఆలోచన హైదరాబాద్‌కు కొత్తేమీ కాదు. 2021లో జీహెచ్ఎంసీ ఉప్పల్‌లో సుమారు 2,000 చదరపు గజాల స్థలంలో ల్యాప్‌టాప్ ప్లగ్ చేసి పనిచేసుకునేలా ప్రత్యేక థీమ్ పార్కును రూపొందించింది. అప్పట్లో కరోనా పరిస్థితుల వల్ల ఆ ప్రయత్నానికి పెద్దగా ప్రచారం దక్కలేదు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ పని విధానాలు సాధారణమైన నేపథ్యంలో ఈ కొత్త ప్రయత్నం ఉపయోగపడుతుందని నగరవాసులు భావిస్తున్నారు.

ఈ కొత్తరకం థీమ్ ఈ మధ్య దుబాయ్ లో కూడా ప్రారంభం అయింది. ఇప్పుడు సైబరాబాద్ పరిధిలోని పార్కులలో కూడా వర్క్ ఫ్రమ్ పార్క్ విధానాన్ని వచ్చే జనవరి 1 నాటికి ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. శేరిలింగంపల్లి జోన్ మసీద్ బండ మాధవ హిల్స్ కాలనీలో ఒకటిన్నర ఎకరాల పార్క్ ను, కూకట్ పల్లి జోన్, మాదాపూర్ లో ఎకరా విస్తీర్ణం ఉన్న పార్క్ లోనూ ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి.

 తాగునీటితో ఫ్లోర్ క్లీనింగ్.. 'అక్షయకల్ప ఫార్మ్స్'కు రూ.20,000 జరిమానా.. డ్రైనేజీ కనెక్షన్ కట్
తాగునీటితో ఫ్లోర్ క్లీనింగ్.. 'అక్షయకల్ప ఫార్మ్స్'కు రూ.20,000 జరిమానా.. డ్రైనేజీ కనెక్షన్ కట్

ఐటీ సంస్థలు ఎక్కువగా ఉన్న సైబరాబాద్ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ, ఇరుకైన ఇళ్ల మధ్య పనిచేసేవారికి ఇది మంచి ప్రత్యామ్నాయం అవుతుంది. వైఫై వేగం, భద్రత, విద్యుత్ సౌకర్యం, నిర్వహణ అన్ని వసతులతో ఉదయం నుండి అర్దరాత్రి వరకు అన్ని మౌలిక వసతులతో వీటిని నిర్వహించాలని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+