స్త్రీ శక్తి పథకం ఇక - మహిళలతో కలిసి బస్సులో చంద్రబాబు ప్రయాణం, కీలక ప్రకటన..!!

ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన స్త్రీ శక్తి పథకానికి ఏడాది పూర్తయింది. స్త్రీ శక్తికి సంవత్సరం- రెట్టింపైన ఆత్మగౌరవం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా సీఎం చంద్రబాబు రాజధానిలోని పరేడ్ గ్రౌండ్స్ నుంచి మహిళలతో బస్సులో ప్రయాణం చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. పథకం పైన వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. మరింత పటిష్ఠంగా అమలు చేస్తామని ప్రకటించారు.

కూటమి ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 15వ తేదీన స్త్రీ శక్తి పథకం ప్రారంభించింది. ఏడాది పూర్తి కావటంతో సీఎం చంద్రబాబు నేరుగా మహిళలతో ఈ పథకం నిర్వహణ పైన వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా సమస్యలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసారు. స్త్రీ శక్తి పథకం అమలు తీరు తెన్నుల గురించి మహిళలను అడిగి తెలుసుకు న్నారు. మహిళల కుటుంబ స్థితిగతులపై ఆరా తీశారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలను అందిపుచ్చు కోవాలని సూచించారు. కొందరు మహిళలు తమ అనారోగ్య సమస్యలను సీఎం కు వివరించారు. దీంతో, ఆరోగ్య అలవాట్లు మార్చుకుంటే అనారోగ్యం దరిచేరదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటే... సంపాదనను మందుల కొనుగోలు ఖర్చులను ఆదా చేసుకోవచ్చని చెప్పారు. ఏపీలోని పేద, మధ్య తరగతి ప్రజలు, కుటుంబాల స్థితిగతులను తెలుసుకునేందుకు ఈ తరహాలో తాను ముఖాముఖి అవుతున్నానని మహిళలకు సీఎం చంద్రబాబు చెప్పారు.

TTD: తిరుమలలో ఫిర్యాదుల పరిష్కారానికి కొత్తగా 'నందకం’ యాప్‌..!!
TTD: తిరుమలలో ఫిర్యాదుల పరిష్కారానికి కొత్తగా 'నందకం’ యాప్‌..!!
cm-chandra-babu-interacted-with-some-women-beneficiaries-of-the-scheme-and-inquired-about-their-fam

స్త్రీశక్తి పథకం మరింత పకడ్బందీగా అమలు

కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం 5 కేటగిరీల బస్సుల్లో అమలు చేస్తోందని వివరించారు. ఆర్టీసీ పరిధిలోని ఎక్స్‌ప్రెస్, అల్ట్రా పల్లెవెలుగు, పల్లెవెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ కేటగిరీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో వివిధ వర్గాల మహిళలు 87 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని వెల్లడించారు. రోజుకు 24 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారన్నారు. APSRTCలోని 9,978 బస్సుల్లో.. 7,631 బస్సుల్లో స్త్రీ శక్తి పథకం అమలవుతోందని తెలిపారు. మొత్తం APSRTCలో ఉన్న 76 శాతం బస్సుల్లో పథకం అమలు చేస్తున్నామన్నారు. స్త్రీ శక్తికి ముందు బస్సు ప్రయాణాల్లో మహిళల వాటా 40 శాతం ఉండగా.. పథకం అమలుతో 62 శాతం మహిళల ప్రయాణాలు పెరిగాయని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+