రాహుల్ సిప్లిగంజ్‌కు ఆ వివాదంతో ఎలాంటి సంబంధం లేదు.. విశాఖ యువతి క్లారిటీ!

విశాఖ యువతిని ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేశారనే ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బావమరిది రాహుల్ రెడ్డిపై కేసు వివాదం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్లో 15 మందిపై కేసు నమోదైనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్ తనను బెదిరించారనే ఆరోపణలు కూడా వెలుగులోకి రావడం ఈ విషయం మరింత చర్చనీయాంశంగా నిలిచింది. ఇదిలా ఉండగా తాజాగా బాధితురాలు ఈ విషయంపై కీలక కామెంట్స్ చేస్తూ క్లారిటీ ఇచ్చింది. అసలు ఈ విషయంతో రాహుల్ సిప్లిగంజ్ కు సంబంధం లేదంటూ అసలు విషయాన్ని బయటపెట్టింది.

ఈ సినిమా ఏంటి బాసూ ఇంత బాగుంది..!
ఈ సినిమా ఏంటి బాసూ ఇంత బాగుంది..!

తాజాగా ఈ వ్యవహారంపై బాధిత యువతి ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలను బయటపెట్టింది. ఈ విషయం రాహుల్ రెడ్డి, తనకు మధ్య జరగుతున్న వ్యవహారమని.. రాహుల్ సిప్లిగంజ్‌కు ఈ వివాదంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఇరువురం లీగల్ గా వెళ్తున్నామని.. పోలీసులకు కూడా చెప్పామని ఆ యువతి వెల్లడించింది. ప్రస్తుతం బాధిత యువతికి సంబంధించిన ఆడియో నెట్టింట వైరలవుతోంది.

Singer Rahul Sipligunj Has No Role in Vizag Case Victim Gives Full Clarity to the Fraud Case

అయితే ఈ కేసులో ఇతర వ్యక్తుల ప్రమేయం, బెదిరింపుల వల్లే రాహుల్ సిప్లిగంజ్ పేరు వచ్చిందని.. ఈ వ్యక్తిగత విషయం ఇంత పెద్ద సమస్యగా మారడానికి కొంతమంది వ్యక్తులే అని బాధిత యువతి పేర్కొన్నారు. ఆ వ్యక్తులు తనను బెదిరించి, దాడులు చేసి, ప్రాణభయం తలెత్తేలా చేసి రాహుల్ రెడ్డి బంధువుగా ఓ సెలబ్రిటీ పేరు చెప్పేలా వీడియోలు చేయించుకున్నారని తెలిపింది. ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చిన వీడియోలు ఆ వ్యక్తులే తన చేత బలవంతంగా చేయించారని బాధిత యువతి తెలిపింది. తనను హనీ ట్రాప్ కేసులో ఇరికిస్తామని, నీకు వ్యతిరేకంగా తప్పుడు ఆధారాలను సృష్టిస్తామని బెదిరించినట్లు ఆమె వెల్లడించింది. తప్పుడు ఫిర్యాదులు సృష్టించి తన మీద ఒత్తిడి తెచ్చారని ఆమె వాపోయింది. రాహుల్ రెడ్డికి, తనకు మధ్య ఉన్న వివాదంతో రాహుల్ సిప్లిగంజ్ కు ఎలాంటి సంబంధం లేదని బాధిత యువతి స్పష్టం చేశారు.

Vishwanath and Sons Movie Review: సూర్య సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath and Sons Movie Review: సూర్య సినిమా హిట్టా? ఫట్టా?

ప్రభుత్వాన్ని, పోలీసులను అడ్డుపెట్టుకుని కొంతమంది తన కెరీర్ ను, జీవితాన్ని నాశనం చేయడానికి చాలా పెద్ద కుట్రలు చేశారని ఆమె తెలిపారు. జరగని విషయాలను కూడా క్రియేట్ చేశారన్నారు. తనను తప్పుడు విధంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత యువతి క్లారిటీ ఇవ్వడంతో రాహుల్ సిప్లిగంజ్‌కు ఈ వివాదంతో ఎలాంటి ప్రమేయం లేదని తేలిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+