పోలీస్ శాఖలో ఉద్యోగాల వయోపరిమితిపై ప్రభుత్వం కీలక నిర్ణయం- మరో రెండేళ్లు..!!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్ శాఖలో ఉద్యోగాల వయోపరిమితిపై తమ నిర్ణయం వెల్లడించింది. పోలీస్, యూనిఫామ్ సర్వీసుల ఉద్యోగాలకోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితిని మరోసారి సడలిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితిని మరోసారి సడలిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో వయోపరిమితి కారణంగా ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించనుంది. ప్రస్తుతం ఉన్న ఐదేళ్ల వయో పరిమితి సడలింపునకు అదనంగా మరో రెండేళ్లు రిలాక్సేషన్ ఇచ్చింది. దీంతో మొత్తం ఏడేళ్ల వరకు అదనపు వయోపరి మితి సడలింపును వర్తింప చేస్తోంది. సివిల్, ఫైర్ సర్వీసెస్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్) పోస్టులకు ఈ సడలింపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్లకు కూడా తాజా సడలింపు వర్తిస్తుందని జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉత్తర్వుల ప్రకారం.. పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ఠ వయోపరి మితి 34ఏళ్లుగా.. సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) పోస్టులకు 37ఏళ్లుగా నిర్ణయించింది.

కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల పై సీఎం రేవంత్ గుడ్ న్యూస్..!!
కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల పై సీఎం రేవంత్ గుడ్ న్యూస్..!!
telangana-govt-raised-the-upper-age-limit-for-uniformed-services-recruitment-by-2-years-here-the-de

ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో

కాగా, ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో పోలీస్ ఉద్యగాల కోసం సిద్ధమవుతున్నవారికి ప్రయోజనం కలగనుంది. అయితే, ఇప్పటికే ఇచ్చిన సడలింపులతో కలిపి అభ్యర్థులకు మొత్తంగా ఏడేళ్ల అదనపు వయోపరిమితి అందుబాటులోకి వచ్చినట్లయింది. దీంతో వయోపరిమితి దాటిన కారణంగా ఉద్యోగ నోటిఫికేషన్లకు దూరమైన అభ్యర్థులు మరోసారి పోటీ పడే అవకాశం దక్కనుంది. SCT PC (Civil), SCT SI (Civil), SCT PC (Mechanic), SCT PC (Driver) పోస్టులకు ఈ నిర్ణయం వర్తించనుంది. అదే విధంగా SCT SI (FPB) పోస్టుకు కూడా వయో సడలింపు వర్తింపు వర్తిస్తుంది. కాగా.. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని.. ఆగస్టు 19వ తేదీ ఉదయం 8 గంటల నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలు కానుంది. పూర్తి వివరాలు TSLPRB అధికారిక వెబ్‌సైట్ www.tgprb.inలో అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+