'రణబాలి' నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ లుక్ వైరల్..

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'రణబాలి'.. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ గూస్ బంప్స్ ను తెప్పిస్తోంది. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ ఒంటి నిండా నెత్తుటి మరకలతో జాతీయ పతాకాన్ని ఒంటిపై కప్పుకుని వీరోచితంగా పోరాడే యోధుడిగా నిల్చుని ఉన్నాడు. కానీ ఈ పోస్టర్ లో ఆయన ఫేస్ ను మాత్రం రివీల్ చేయలేదు. మీసాల వరకు మాత్రమే పోస్టర్ లో చెప్పారు. మెలి తిరిగిన మీసాలతో బ్రిటిష్ అధికారుల గుండెల్లో చెమటలు పట్టించే యోధుడిగా ఉన్నారు.

అందరికీ 80 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అని పోస్టర్ కింద తెలిపారు. అంతేకాక మరిచిపోయిన నేల నుంచి వీరోచితమైన చరిత్ర బయటపడుతుంది. అని పోస్టర్ కింద పేర్కొన్నారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఇక రణబాలి మూవీలో విజయ్ దేవరకొండ సరసన ఆయన సతీమణి రష్మిక మందాన్న హీరోయిన్ గా నటిస్తోంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వై. రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ - రష్మిక మందాన్న ఇరువురికీ పెళ్లి అయిన తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న మొదటి చిత్రం ఇదే కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.

Ranabaali movie poster Special poster from Ranabaali released Vijay Deverakonda look goes viral

ఈ సినిమా పాన్ ​ఇండియా స్థాయిలో సెప్టెంబర్‌ 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ 'రణబాలి' చిత్రం దాదాపు 1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందినట్లు దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్‌ ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు విజయ్ దేవరకొండ ఈ సినిమాతో పాటు రౌడీ జనార్థన అనే సినిమా కూడా చేస్తున్నారు. అలాగే హాయ్ నాన్న దర్శకుడితోనూ ఓ సినిమా చేస్తున్నారు విజయ్ దేవరకొండ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+