Ustaad Bhagat Singh: నరుకుడే.. భారీ యాక్షన్ షెడ్యూల్ ప్లాన్

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ వ్యవహారాలకు బ్రేక్ ఇచ్చారు. తాత్కాలిక విరామాన్ని ప్రకటించారు. వారాహి విజయ యాత్రతో తీరిక లేకుండా గడిపిన ఆయన పొలిటికల్ టూర్లు, రాజకీయ కార్యకలాపాలకు పుల్ స్టాప్ పెట్టారు. చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు పవన్ కల్యాణ్.

పవన్ కల్యాణ్ నటిస్తోన్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ ఉన్నాయి. ఈ రెండు కూడా హైఓల్టేజ్ యాక్షన్‌ మూవీస్. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నాయి. ఓజీ సినిమా కొద్ది రోజుల కిందటే ముంబైలో షూటింగ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి యూనిట్ వరుసగా నాలుగు షెడ్యూళ్లను పూర్తి చేసింది. సుమారు 60 శాతం మేర టాకీ పార్ట్ కూడా కంప్లీట్ అయింది.

Ustaad Bhagat Singh

రన్ రాజా రన్, సాహో చిత్రాలను తీసిన సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోందీ మూవీ. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు ఈ సినిమాను. తమిళనటి ప్రియాక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మి కీలక పాత్రలో నటిస్తోన్నారు.

ప్రకాష్ రాజ్, తమిళ నటులు అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్.. సహా పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తోన్నాడు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయాలనేది చిత్రం యూనిట్ ప్లాన్. అందుకే ఈ మూవీ షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసుకుంటోంది. పవన్ బర్త్‌డే నాడు ఓజీ టీజర్ విడుదలయింది.

మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. హరీష్ శంకర్ దర్శకుడు. మైత్రీ మూవీస్ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తోననారు. శ్రీలీల హీరోయిన్. అశుతోష్ రాణా, నవాబ్ షా, అవినాష్, గౌతమి కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. తమిళంలో విజయ్ నటించిన థేరి సినిమాకు రీమేక్ ఇది.

Ustaad Bhagat Singh

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నేటి నుంచి మళ్లీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇవ్వాళ్టి నుంచి షూటింగ్ పునఃప్రారంభం కాబోతోన్నట్లు దర్శకుడు హరీష్ శంకర్ తెలిపాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. కత్తులు, కటార్లు, సుత్తి, గొడ్డళ్లతో దిగిన ఓ ఫొటోను హరీష్ శంకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+