వందే భారత్ స్లీపర్లు సిద్దం - గంటకు 220 కిమీ, అన్నీ ప్రత్యేకం..!!
రైల్వేలో ఇప్పుడు వందేభారత్ శకం నడుస్తోంది. ప్రయాణీకుల నుంచి ఆదరణ పెరుగుతున్న వేళ మరింత సౌకర్యవంతంగా వందేభారత్ రైళ్లను తీర్చిదిద్దటానికి రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం సీటింగ్ సౌకర్యంతో నడుస్తున్న వందేభారత్ ను కొత్త వర్షన్ లో స్లీపర్లతో తీసుకొచ్చేందుకు నిర్ణయించింది. ఇదే సమయంలో మరింత వేగంతో దూసుకెళ్లేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక నుంచి వందేభారత్ రైళ్లు 220 కిమీ వేగంతో ప్రయాణం చేయనున్నాయి.
పెరుగుతున్న ఆదరణ
వందేభారత్ కొన్ని మినహా అధిక శాతం ప్రయాణీకుల నుంచి మంచి ఆదరణతో నడుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రెండు వందేభారత్ రైళ్లు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ - విశాఖ, సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడుస్తున్న వందేభారత్ కు వంద శాతం ఆక్యెపెన్సీ రేషియా కొనసాగుతోంది. త్వరలోనే మరో రెండు రైళ్లు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రారంభించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇదే సమయం లో దేశ వ్యాప్తంగా వందేభారత్ కు పెరుగుతున్న ఆదరణతో మరింత వేగంగా.. సౌకర్యవంతంగా వీటిని తీరి దిద్దాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం వందేభారత్ రైళ్లు ట్రాక్ సామర్ధ్యాన్ని బట్టి గంటకు 60 నుంచి 130 కిమీ వేగంతో ప్రయాణిస్తున్నాయి.

గంటకు 220 కిమీ వేగం
రానున్న రోజుల్లో నరగాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించే దిశగా వేగం పెంచేందుకు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ప్రణాళికలు రచిస్తున్నారు. భవిష్యత్ లో ఈ వేగాన్ని 200 నుంచి 220 కిమీ పెంచాలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ రైళ్లకు స్టెయిన్ లెస్ స్టీల్ లోహాన్ని వాడుతున్నారు. హైస్పీడ్ వేగాన్ని అందుకోవాలంటే అల్యూమినియం లోహంతో వీటిని తయారు చేయాల్సి ఉంటుంది. దీనికి తగట్లు సిగ్నలింగ్ వ్యవస్థలోనూ సాంకేతిక మార్పులు రానున్నాయి. అదే సమయంలో 2025 జూన్‌లో వందేభారత్ రైళ్ల కోసం స్లీపర్ కోచ్‌లు తయారు కానున్నాయి. అదే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తయి..2026 నుంచి అందుబాటులోకి వచ్చే విధంగా రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది.
స్లీపర్ కోచ్ లతో సిద్దం
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కావల్సిన స్లీపర్ కోచ్‌లను టిటాగర్ రైల్ సిస్టమ్స్ తయారు చేయనుంది. 80 వందేభారత్ స్లీపర్ రైళ్లను తయారు చేసేందుకు బీహెచ్ఈఎల్‌తో ఒప్పందం జరగనుంది. ఉత్తర్ పరా ప్లాంట్‌లో టిటాగర్ రైల్ సిస్టమ్స్ లిమిటెడ్‌కు 52 శాతం వాటా ఉంది.వందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ కోచ్ తొలి మోడల్ రెండేళ్లలో సిద్ధం కానుంది. మొదటి 8 రైళ్లు ఉత్తర్ పరా ప్లాంట్‌ల నిర్మాణం కానుండగా, మిగిలినవి చెన్నై ప్లాంట్‌లో తయారవుతాయి. భవిష్యత్ లో గంటకి 245 కిమీ వేగాలన్ని అందుకునే విధంగా డిజైన్ చేసినా..పట్టాల పై మాత్రం దీని అత్యధిక వేగం గంటకు 220 కిమీ మించకుండా నిర్వహించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications