TTD: శ్రీవారి సేవకులుగా అరుదైన ఛాన్స్ - సేవా టికెట్లు విడుదల..!!

Tirumala: తిరుమల శ్రీవారి సేవలో పాల్గొనాలని కోరుకొనే భక్తులకు టీటీటీ గుడ్ న్యూస్ చెప్పింది. 2024 ఫిబ్ర‌వ‌రి 16న ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినానికి సంబంధించిన‌ శ్రీ‌వారి సేవ స్లాట్ల‌ను న‌వంబ‌రు 27న ఉద‌యం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. 18 నుండి 50 ఏళ్ల వ‌ర‌కు వ‌యోప‌రిమితి ఉన్నవారు మాత్ర‌మే ఈ స్లాట్ల‌ను బుక్ చేసుకునేందుకు అర్హులుగా టీటీడీ పేర్కొంది. అదేవిధంగా, తిరుమ‌ల‌, తిరుప‌తిలో భ‌క్తుల‌కు స్వ‌చ్ఛంద సేవ చేసేందుకు టికెట్ల విడుదలపై నిర్ణయం తీసుకుంది.

తిరుమలలో జరిగే రథసప్తమి వేడుకలను మినీ బ్రహ్మోత్సవాలు అంటారు. ఈ మేరకు తిరుమలలో 2024 ఫిబ్ర‌వ‌రి 16న ర‌థ‌స‌ప్త‌మి రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. సూర్య జయంతి సందర్భంగా శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినం జరగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. సూర్యభగవానుడి జయంతి సందర్భంగా కలియుగ వైకుంఠంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు. వీరి కోసం ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినానికి సంబంధించిన‌ శ్రీ‌వారి సేవ స్లాట్ల‌ను న‌వంబ‌రు 27న ఉద‌యం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

The Srivari Seva quota for the month of February-2024 Rathasapthami slots will be released on 27th Nov

తిరుమ‌ల‌, తిరుప‌తిలో భ‌క్తుల‌కు స్వ‌చ్ఛంద సేవ చేసేందుకు గాను 2024 జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రి నెల‌ల‌కు సంబంధించిన శ్రీ‌వారి సేవ, న‌వ‌నీత సేవ‌ కోటాను న‌వంబ‌రు 27న మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు విడుద‌ల చేయనున్నారు. అదేరోజు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప‌ర‌కామ‌ణి సేవ కోటాను టీటీడీ విడుద‌ల చేయ‌నుంది. ఈ సేవ‌ల‌ను www.tirumala.org వెబ్‌సైట్‌లో భ‌క్తులు బుక్ చేసుకోవ‌చ్చని టీటీడీ వెల్లడించింది. ఇక, తిరమలలో వైకుంఠ ఏకాదశి రోజుల్లో స్వామివారిని దర్శించుకునేందుకు 4.50 లక్షల మందికి అవకాశం కల్పిస్తున్నారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయంలో 2023 డిసెంబర్ 23 నుంచి 2024 జనవరి 1 వరకు వైకుంఠ ద్వారాలు తెరచుకుంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+