టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు పై విచారణకు సుప్రీం ఆదేశం..!!
టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అయ్యన్నపాత్రుడిపై నమోదైన ఓ ఫోర్జరీ కేసుకు సంబంధించి దర్యాప్తునకు సుప్రీంకోర్టు అనుమతి ఇస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. సెక్షన్ ఐపీసీ 467 కింద దర్యాప్తు చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్ ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. కేసు దర్యాప్తు సమయంలో హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆయన కుమారుడు రాజేష్‌పై గతంలో ఫోర్జరీ కేసు నమోదు చేసారు. అయ్యన్న మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాచపల్లి రిజర్వాయర్ పంట కాలువపై రెండు సెంట్లు మేర స్థలంలో అక్రమంగా ప్రహరి నిర్మాణం చేశారనే అభియోగం ఉంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయం కావడంతో ఏకంగా పంట కాలువను ఆక్రమించి ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డ్రైవ్‌లో భాగంగా రెవెన్యూ యంత్రాంగం సర్వే చేసింది. ఆ సమయంలో జలవనరుల శాఖకు చెందిన పంట కాలువను ఆక్రమించి అయ్యన్న కుటుంబ సభ్యులు ఇంటి నిర్మాణాన్ని చేపట్టారని గుర్తించారు. ఆ నిర్మాణాన్ని కూలదోసేందు ప్రయత్నించిన సమయంలో వివాదం చోటు చేసుకుంది.

రాజకీయంగా ప్రభుత్వం వేధిస్తోందనే ఆరోపణలు మొదలయ్యాయి. అదే సమయంలో అక్రమ నిర్మాణం కాదంటూ ఫోర్జరీ సంతకాలతో నిరంభ్యంతర పత్రం(ఎన్‌వోసీ)ను సమర్పించారు. అయితే, అయ్యన్న సమర్పించిన పత్రంలోని సంతకం సంబంధిత అధికారిది కాదని సీఐడీకి ఫిర్యాదు అందింది. ఇదే వ్యవహారంలో గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పక్కన పెడుతూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్ 41 సీఆర్‌పీసీ ప్రకారమే విచారణ కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు ధర్మాసనం అనుమతినిచ్చింది. ప్రధాన కేసును మెరిట్ ఆధారంగా విచారణ చేయాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications