తాడిపత్రిలో తేడాలు, జగన్ ఇప్పటికీ సీఎం అని పోలీసులు ఫీలైపోతున్నారు, ఎమ్మెల్యే

రాయలసీమలోని తాడిపత్రిలో అధికార పార్టీ నాయకులకు, స్థానిక పోలీస్ అధికారులతో తేడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ప్రభుత్వం మారిపోయినా పోలీసు అధికారులు మాత్రం ఇప్పటికీ జగన్ సీఎంగా ఉన్నారని, స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అని ఫీల్ అయిపోతున్నారని, వీళ్ల పద్ధతి మార్చుకోకపోతే పరిస్థితులు వేరుగా ఉంటాయని తాడిపత్రి టీడీపీ నాయకులు మండిపడుతున్నారు.

తాడిపత్రిలో అక్రమంగా ఇసుకను అనంతపురం, కర్నూలు, బళ్లారికి తరలిస్తున్నా పోలీసు అధికారులు చోద్యం చూస్తున్నారని తాడిపత్రి టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. ఈ విషయంపై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ను కలిసి తాడిపత్రి సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి పై ఫిర్యాదు చేశారని తెలిసింది. తాడిపత్రిలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవడానికి ప్రత్యేకంగా సీఐలను నియమించాలని టీడీపీ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ కు మనవి చేశారని సమాచారం.

The TDP MLA complained to the Anantapur district SP against the police officers

తాడిపత్రిలో ప్రస్తుతం ఉన్న పోలీసులు వైసీపీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని, స్వేచ్ఛగా ఇసుక తరలిపోతున్నా వాళ్ళు ఏ మాత్రం అడ్డుకోవడం లేదని టీడీపీ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలు అక్రమ తరలిస్తున్న ఇసుక రవాణాను అడ్డుకుంటే మా మా పార్టీ కార్యకర్తలపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ కి సమాచారం ఇచ్చారని తెలిసింది.

ఇటీవల లారీలల్లో అక్రమంగా ఇసుక రవాణా తరలిస్తున్న వాహనాలను టీడీపీ నాయకులు అడ్డుకున్నారని, అ సమయంలో వైసీపీ గూండాలు వచ్చి మా కార్యకర్తలపై దాడి చేసి లారీలను తీసుకువెళ్లి పోయారని, ఇంత జరిగినా పోలీసులు అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వాళ్లని పట్టుకోవడంలేదని, వారి పైన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించలేదని టీడీపీ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ కి ఫిర్యాదు చేశారని తెలిసింది. అయితే అనంతపురం జిల్లా ఎస్పీని తాను మర్యాదపూర్వకంగా కలిశానని, ఆయనతో కొన్ని విషయాలపై చర్చించానని తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+