TTD: తిరుమలలో టీటీడీ ఈవో ఆకస్మిక తనిఖీలు, వరుస సెలవులు, శ్రీవారి దర్శనం
టీటీడీ ఈవో జే శ్యామలరావు, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మంగళవారం తిరుమలలోని సీఆర్‌ఓ జనరల్, నారాయణగిరి షెడ్లు, క్యూ లైన్‌లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.అనంతరం టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ గత మూడు రోజులుగా వరుస సెలవులు, పురటాసి మాసం రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిందని అన్నారు.
రద్దీ పెరగడంతో పాటు, ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు 20 గంటల నుండి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. కావున శ్రీవారి దర్శనం కోసం భక్తులు తమ వంతు వచ్చే వరకు భక్తులు ఓపికతో వేచి ఉండాలని టీటీడీ ఈవో శ్యామలరావు మనవి చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోవడం వలన ఎస్ఎస్ డీ టోకన్లు లేని భక్తులు శ్రీవారి దర్శనం చేసుకోవడానికి ఎక్కువ సమయం పడుతోందని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు.

వైకుంఠం కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు, బయట క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, పాలు, టీ, కాఫీలను టీటీడీ యాజమాన్యం నిరంతరాయంగా అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసిందని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఈ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులను కూడా టీటీడీ నియమించిందని టీటీడీ ఈవో జే శ్యామలరావు, చెప్పారు.
అంతకుముందు నారాయణగిరి షెడ్లు, బయట క్యూ లైన్ల వద్ద అన్నప్రసాదాలు, పాలు, తాగునీరు పంపిణీని టీటీడీ ఈవో జే శ్యామలరావు పరిశీలించారు. సీఆర్ వో వెనుక భాగాన యాత్రికులు వేచి ఉండేలా ఒక వెయిటింగ్ హాల్ ను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని సంబంధిత అధికారులను టీటీడీ ఈవో జే శ్యామలరావు ఆదేశించారు. ఆ తర్వాత, ఆయన సీఆర్ఓ వద్ద ఉన్న యాత్రికుల సమాచార కౌంటర్‌ను టీటీడీ ఈవో జే శ్యామలరావు పరిశీలించారు. యాత్రికులకు వసతి మరియు ఇతర సౌకర్యాలపై మెరుగైన సమాచారం ఎలా తెలియజేయాలనే దానిపై సంబంధిత సిబ్బందికి టీటీడీ ఈవో శ్యామలరావు, కొన్ని సూచనలు చేశారు.












Click it and Unblock the Notifications